చీకట్లో ఎల్లో శారీలో వెలిగిపోతున్న పూజా హెగ్డే.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో హార్ట్ బీట్‌ పెంచేలా పోజులు

బుట్టబొమ్మ పూజా హెగ్డే మొన్నటి వరకు టాలీవుడ్‌ ని ఓ ఊపు ఊపేసింది. స్టార్‌ హీరోలతో జోడీ కట్టి ఉర్రూతలూగించింది. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ ఇప్పుడు.. 
 

pooja hegde look beautiful in yellow saree her sleeveless angle mind block arj

పూజా హెగ్డే ఇటీవల నిత్యం గ్లామర్‌ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో తన హాట్‌ యాంగిల్‌ ఆవిష్కరించింది. చీకట్లో వెలిగిపోతూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లలో హీటు పెంచుతున్నాయి. 

పూజా హెగ్డే.. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడింది. మొదటి సినిమాలు పెద్దగా మెప్పించలేదు. బాలీవుడ్‌ ప్రయత్నం ఫలించలేదు. దీంతో రెండు మూడేళ్లు స్ట్రగుల్‌ అయ్యింది. కానీ తెలుగులోకి రీఎంట్రీ ఆమెకి కలిసొచ్చింది. అల్లు అర్జున్ తో కలిసి నటించిన `డీజే` ఆమె కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌లా మారిపోయింది. 
 


`దువ్వాడ జగన్నాథమ్‌` చిత్రంతో పూజా హెగ్డేకి పెద్ద ఆఫర్లు వరించాయి. ఈ చిత్రం మంచి ఆదరణ పొందడంతో పూజా పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా ఇందులో సాంగ్స్ లో హైలైట్‌ అయ్యింది పూజా. బన్నీ డాన్సులకు తగ్గట్టుగా ఆమె రిథమ్‌ ఇచ్చిన తీరు ఆకట్టుకుంది. అందుకే ఈ బ్యూటీపై టార్చ్ లైట్‌ పడినట్టయ్యింది. 
 

ఆ తర్వాత పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చూస్తుండగానే ఆమె కెరీర్‌ టర్న్ తీసుకుంది. పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చి పడ్డాయి. బిగ్‌ స్టార్స్ తో సినిమా చేసే అవకాశాలు వరించాయి. `రంగస్థలం`లో జిగేల్‌ రాణి అంటూ ఉర్రూతలూగించింది. అత్యంత ఊరమాస్‌ సాంగ్‌ ఇది. పూజాకి మంచి పేరుని తెచ్చింది. 
 

ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`, మహేష్‌బాబుతో `మహర్షి`, వరుణ్‌ తేజ్‌తో `ముకుందా` తర్వాత `గద్దల కొండ గణేష్‌`, బన్నీతో `అల వైకుంఠపురములో` చిత్రాలు చేసింది. వరుసగా బ్యాక్ టూ బ్యాక్‌ విజయాలు అందుకుంది. పూజా నటిస్తే ఆ సినిమా హిట్టే అనే పేరు తెచ్చుకుంది. దీంతో అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్‌`, ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`, విజయ్‌తో `బీస్ట్`, రామ్‌చరణ్‌తో `ఆచార్య` చిత్రాలు చేసింది. కానీ ఈ సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. 
 

హిందీలో చేసిన `సర్కస్‌`, `కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రాలు సైతం ఫెయిల్‌ అయ్యాయి. `ఎఫ్‌3`లో ఐటెమ్‌ సాంగ్‌ వర్కౌట్‌ కాలేదు. దీంతో మరో రెండేళ్లలోనే పూజా కెరీర్‌ రివర్స్ అయ్యింది. లక్కీ హీరోయిన్‌ కాస్త, ఐరన్‌ లెగ్‌గా మారిపోయింది. సినిమా ఫెయిలూర్స్ ఈ బ్యూటీపై ప్రభావాన్ని చూపించాయి. ఈ ఎఫెక్ట్ ఆమె ఒప్పుకున్న సినిమాలపై కూడా పడింది. 
 

ఇలా ఆమె మహేష్‌తో `గుంటూరు కారం` చిత్రం, పవన్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలను వదులుకోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా తెలుగులో ఈ బ్యూటీ ఖాళీ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఆఫర్లని దక్కించుకునే పనిలో పడింది. సాయిధరమ్‌ తేజ్‌తో సంపత్‌ నంది సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందట. అలాగే అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతుందట. 
 

ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే పెళ్లికి సంబంధించి ఓ క్రేజీ రూమర్‌ వినిపిస్తుంది. ఆమె ఓ క్రికెటర్‌ని పెళ్లి చేసుకోబోతుందట. ఇటీవల ఆయనతో కలిసి ఓ ప్రైవేట్ లో మెరిసినట్టు ప్రచారం జరుగుతుంది. కాబోయే వాడు అతనే అనే రూమర్ ఊపందుకుంది.మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. 
 

Latest Videos

vuukle one pixel image
click me!