Pooja Fear: పూజా హెగ్డేని వణికిస్తున్న రాజమౌళి.. ఇద్దరికి లింకేంటి?

Published : Apr 17, 2022, 09:42 AM IST

పూజా హెగ్డేని రాజమౌళి భయపెడుతున్నాడు. జక్కన్న విషయంలో ఈ బుట్టుబొమ్మ వణికిపోతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో అని టెన్షన్‌లో ఉంది. మరి రాజమౌళి ఏం చేశాడు? పూజా హెగ్డే ఎందుకు భయపడుతుందనేది చూస్తే..

PREV
17
Pooja Fear: పూజా హెగ్డేని వణికిస్తున్న రాజమౌళి.. ఇద్దరికి లింకేంటి?

పూజా హెగ్డే(Pooja Hegde) మొన్నటి వరకు `లక్కీ హీరోయిన్‌`. ఆమెది `గోల్డెన్‌ లెగ్‌` అనే ట్యాగ్‌ వినిపించేది. పూజా హెగ్డే సినిమాలో ఉంటే అది హిట్టే అనేది మేకర్స్ నమ్ముతున్నారు. మొన్న నిర్మాత దిల్‌రాజు కూడా ఇదే విజయాన్ని ఓపెన్‌గా చెప్పారు. `పూజా.. కాజా` అంటూనే ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఉన్న `బీస్ట్` సినిమా హిట్‌ అవుతుందన్నారు. అంతేకాదు పూజా సెంటిమెంట్‌తో తాను హిట్‌ కొట్టాలని `ఎఫ్‌3`లో ఆమెతో ఐటెమ్‌ సాంగ్‌ చేయిస్తున్నారు. 

27

థళపతి విజయ్‌ హీరోగా నటించిన `బీస్ట్`(Beast) చిత్రం నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల విషయంలో తమిళనాట పర్వాలేదనిపిస్తుంది. విజయ్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కారణంగా బెటర్‌గానే కలెక్షన్లని చేస్తుంది. కానీ ఇతర భాషల్లో మాత్రం దారుణంగా పడిపోయింది. డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. దీని ప్రభావం పూజా హెగ్డేపై పడుతుంది. ఇప్పటికే ఆమెపై సోషల్‌ మీడియాలో నెగటివ్‌ టాక్‌ మొదలైంది. 

37

ఇదిలా ఉంటే ఇప్పటికే పూజా హెగ్డే నటించిన అఖిల్‌ మూవీ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` పరాజయం చెందింది. ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీనికితోడు ప్రభాస్‌తో నటించిన `రాధేశ్యామ్‌` చిత్రం డిజాస్టర్‌ అకౌంట్లో పడింది. ఈ రెండు సినిమాలతోనే  డిజప్పాయింట్‌లో పూజాకి `బీస్ట్` తోడయ్యింది. దీంతో ఆమెలో టెన్షన్‌ స్టార్ట్ అయ్యిందని సోషల్‌ మీడియా టాక్‌. ఇప్పుడు కొత్తగా రాజమౌళి భయం పట్టుకుందట పూజాహెగ్డేకి. 

47

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ మార్చి 25న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కి జాతీయ స్థాయి(పాన్‌ ఇండియా) గుర్తింపు వచ్చింది. వారిద్దరు ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్నారు. అయితే రాజమౌళితో చేసిన హీరోల నెక్ట్స్ చిత్రాలు పరాజయం చెందుతాయనే సెంటిమెంట్‌ వినిపిస్తుంటుంది. ఇప్పటి వరకు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రవితేజ, సునీల్‌ల విషయంలో అదే జరిగింది. 
 

57

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలు. చరణ్‌ నుంచి నెక్ట్స్ విడుదల కాబోతున్న సినిమా `ఆచార్య`. ఆయన తండ్రి చిరంజీవితోపాటు ఒక మెయిన్‌ రోల్‌ చేస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతుంది. రాజమౌళి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే ఈ సినిమా పరిస్థితేంటనేది టెన్షన్‌ యూనిట్‌లో నెలకొంది. అదే జరిగితే పూజా హెగ్డేకి మరో ఫ్లాప్‌ పడబోతుందని అంటున్నారు నెటిజన్లు. 
 

67

ఇప్పటికే పూజా హెగ్డే.. వరుస పరాజయాలతో కాస్త ఆందోళన చెందుతుంది. ఇప్పుడు రాజమౌళి కారణంగా మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోవాల్సి వస్తుందని, ఇదే జరిగితే, వరుసగా నాలుగు ఫ్లాప్‌లతో `గోల్డెన్‌ లెగ్‌`, `లక్కీ హీరోయిన్‌` అనే ట్యాగ్‌లకు కాలం చెల్లినట్టే అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. అయితే రాజమౌళి సెంటిమెంట్‌ పుకారు మాత్రమే అని, బలమైన కంటెంట్‌ ఉంటే, బాగా తీసి ఉంటే ఏ సినిమా అయినా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని, సక్సెస్‌ సాధిస్తుందంటున్నారు. మరి `ఆచార్య` రాజమౌళి సెంటిమెంట్‌కి బలవుతుందా? దాన్ని బ్రేక్‌ చేసి నిలబడుతుందా? పూజాకి సక్సెస్‌ వస్తుందా? అనేది తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే. 

77

పూజా హెగ్డే ప్రస్తుతం `ఆచార్య`తోపాటు మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తుంది. ఇది త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోబోతుంది. మరోవైపు `ఎఫ్‌ 3`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. దీనికిగానూ ఆమె కోటిన్నర పారితోషికం తీసుకుంటుందట. అలాగే హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తుంది. నాగచైతన్యతోనూ ఓ సినిమా చేయబోతుందని టాక్‌. పవన్‌తో హరీష్‌ శంకర్‌ సినిమా చేయాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories