Pooja Hegde: హైదరాబాద్ లో 4 కోట్లు, ముంబైలో 45 కోట్లు.. చైతు ఫ్లాప్ మూవీతో ఎంట్రీ, 100 కోట్లు పోగు చేసిన నటి

Published : Feb 03, 2025, 08:55 AM ISTUpdated : Feb 03, 2025, 08:57 AM IST

Pooja Hegde Assets: ఈ తరం హీరోనులకు క్రేజ్ ఎక్కువ కాలం ఉండడం లేదు. దీనితో నటీమణులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని ఫాలో అవుతున్నారు. చేతినిండా సినిమాలు ఉన్న టైంలోనే ఆస్తులు పోగేసుకుంటున్నారు.

PREV
15
Pooja Hegde: హైదరాబాద్ లో 4 కోట్లు, ముంబైలో 45 కోట్లు.. చైతు ఫ్లాప్ మూవీతో ఎంట్రీ, 100 కోట్లు పోగు చేసిన నటి
Pooja Hegde

Pooja Hegde Assets: ఈ తరం హీరోనులకు క్రేజ్ ఎక్కువ కాలం ఉండడం లేదు. దీనితో నటీమణులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని ఫాలో అవుతున్నారు. చేతినిండా సినిమాలు ఉన్న టైంలోనే ఆస్తులు పోగేసుకుంటున్నారు. పూజా హెగ్డే ఆస్తుల గురించి సంచలన విషయాలు బయటకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం వరకు పూజా హెగ్డేకి టాలీవుడ్ లో తిరుగులేదు అన్నట్లుగా సాగింది. 

25
Pooja Hegde

కానీ వరుస ఫ్లాపులతో ఆమె క్రేజ్ పడిపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో మాత్రం బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె దేవా చిత్రంలో నటించింది. షాహిద్ కపూర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 31న విడుదలైంది. ఈ చిత్రానికి పూజా హెగ్డే 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో పూజా హెగ్డే ఆస్తుల గురించి ఆసక్తికర వివరాలు బయటకి వస్తున్నాయి. 

35
pooja hegde

రీసెంట్ గా పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో 6 కోట్ల విలువైన సీ ఫేసింగ్ ఫ్లాట్ ని కొనుగోలు చేసిందట. పూజా హెగ్డే ఎక్కువ సమయం ముంబైలో ఉంటుంది. సౌత్ లో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. హైదరాబాద్ లో పూజా హెగ్డేకి 4 కోట్ల విలువైన ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది. ఇక ముంబైలోనే ఆమెకి 4000 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉంది. దాని విలువ ఏకంగా 45 కోట్లు అని సమాచారం. 

45

ఇక పూజా హెగ్డే తరచుగా కార్లు మారుస్తూ ఉంటుంది ఆమె గ్యారేజ్ లో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. 60 లక్షల విలువైన జాగ్వార్, 2 కోట్ల విలువైన పొర్చే, 80 లక్షల విలువైన ఆడి కారు, 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు పూజా హెగ్డే కి ఉన్నాయి. పూజా హెగ్డే ఫ్యాషన్ ఐకాన్, ఆమె హ్యాండ్ బ్యాగ్స్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కొక్కటి లక్ష పైగా ఖరీదైన హ్యాండ్ బ్యాగులు పూజా హెగ్డే వద్ద 3 ఉన్నాయట. 

55
Pooja hegde

ఒక్కో చిత్రానికి పూజా హెగ్డే 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. అదే విధంగా పూజా హెగ్డే అనేక బ్రాండ్స్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో యాడ్ కి ఆమె 40 లక్ష వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది అని సమాచారం. మొత్తంగా పూజా హెగ్డే క్రేజ్ ఉన్నప్పుడు 100 కోట్లకి పైగా ఆస్తులు సొంతం చేసుకుందట. పూజా హెగ్డే టాలీవుడ్ లో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ డిజాస్టర్. ఆ తర్వాత తిరిగి పుంజుకోవడానికి చాలా టైం పట్టింది. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధమ్ చిత్రంతో పూజా హెగ్డేకి క్రేజ్ వచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories