రెండు రోజుల్లో రిలీజ్, బజ్ ,క్రేజ్ కొద్దిగా కూడా లేదేంటి బాస్ ?

Published : Feb 03, 2025, 08:36 AM IST

అజిత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'పట్టుదల' పై ఎలాంటి క్రేజ్ లేదు. సినిమా సెన్సార్ పూర్తి అయ్యి, ఫిబ్రవరి 6న రిలీజ్ కి రెడీ అయినా, ప్రమోషన్ లేక, సోషల్ మీడియాలో కూడా చర్చ లేదు. అజిత్ గత చిత్రాలు డిజాస్టర్ కావడమే ఇందుకు కారణం అంటున్నారు.

PREV
13
 రెండు రోజుల్లో రిలీజ్, బజ్ ,క్రేజ్ కొద్దిగా కూడా  లేదేంటి బాస్ ?
Ajith, Vidaamuyarchi, pattudala, Telugu news

ఒక టైమ్ లో తెలుగులో అజిత్ కు  ఓ రేంజి మార్కెట్ ఉండేది. ఆయన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయ్యినవి ఉన్నాయి. అయితే ఆ క్రేజ్ మెల్లిగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అజిత్ లేటెస్ట్ యాక్ష‌న్ మూవీ ‘పట్టుదల’ అయితే అసలు ఎవరూ పట్టించుకున్నట్లు కనపడటం లేదు.

ఎక్కడా చిన్నపాటి క్రేజ్ కూడా లేదు. ఈ సినిమా సెన్సార్ పూర్తి.. ఫిబ్ర‌వ‌రి 6న వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌ కు రెడీ అయ్యింది. కానీ ఎక్కడా ఈ సినిమాకు ప్రమోషన్ లేదు. మరో మూడు రోజుల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా మాట్లాడటం లేదు. అందుకు కారణం అజిత్ గత చిత్రాలు ఇక్కడ డిజాస్టర్ అవటమే అంటున్నారు. 

23
Ajith Kumar starrer Vidaamuyarchi film

తమిళంలో స్టార్ హీరో అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ‘పట్టుదల’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి  ట్రైలర్, టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌ వదిలారు. దేనికీ రెస్పాన్స్ లేదు. మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా సినిమాపై అంచ‌నాలు క్రియేట్ కావటం లేదు.  ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు.

33
Ajith, Vidaamuyarchi, pattudala, Telugu news

 

అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేప‌ర్ లుక్‌తో నెవ‌ర్ బిఫోర్ అవతార్‌లో మెప్పించ‌బోతున్నారు. త‌న వాళ్ల కోసం అజిత్ విల‌న్స్‌తో చేస్తున్న ఫైట్స్, అజిత్‌, చార్మింగ్ బ్యూటీ త్రిష మ‌ధ్య కుదిరిన క్యూట్ కెమిస్ట్రీతో పాటు అజ‌ర్ బైజాన్‌లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అబ్బుర‌ప‌రుస్తాయంటున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో పట్టుదల చిత్రాన్ని తెరకెక్కించారని టీమ్ చెప్తోంది.

మ‌రో వైపు యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మ‌రోవైపు స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. రెజీనా క‌సాండ్ర సైతం ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి వైవిధ్య‌మైన పాత్ర‌లో అల‌రిస్తుంద‌ని ట్రైల‌ర్‌లో ఆమెను చూస్తుంటేనే అర్త‌మ‌వుతుంది. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌,  నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

  అజిత్  ‘ప‌ట్టుద‌ల‌’ (విడాముయ‌ర్చి) సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
 

click me!

Recommended Stories