న్యూడ్‌గా కనిపించడానికైనా, ఐటెమ్‌ సాంగ్‌లకైనా నేను రెడీ.. డైరెక్టర్లకి `పొలిమేర 2` హీరోయిన్‌ బోల్డ్ ఆఫర్‌..

Published : May 20, 2024, 01:48 PM ISTUpdated : May 20, 2024, 01:56 PM IST

`పొలిమేర 2` హీరోయిన్‌ కామాక్షి భాస్కర్ల.. తాజాగా బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. విలక్షణ పాత్రల్లో నటిస్తున్న ఆమె న్యూడ్‌గా అయినా నటించేందుకు రెడీ అంటోంది.   

PREV
16
న్యూడ్‌గా కనిపించడానికైనా, ఐటెమ్‌ సాంగ్‌లకైనా నేను రెడీ.. డైరెక్టర్లకి `పొలిమేర 2` హీరోయిన్‌ బోల్డ్ ఆఫర్‌..

`పొలిమేర 2` సినిమాతో పాపులర్‌ అయ్యింది కామాక్షి భాస్కర్ల. బలమైన పాత్రలో కనిపించి మెప్పించింది. అంతకు ముందు `సైతాన్‌`లో బోల్డ్ రోల్‌ చేసింది. నటిగా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పిస్తూ తనలోని విలక్షణ నటిని అటు ఆడియెన్స్ కి, ఇటు సినిమా పరిశ్రమకి పరిచయం చేస్తుంది. 

26

కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బోల్డ్ రోల్స్, న్యూడ్‌గా చేయడం, ఐటెమ్ సాంగ్ లపై ఓపెన్‌ అయ్యింది. అంతేకాదు మేకర్స్ కి రిక్వెస్ట్ కూడా చేస్తుంది. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో చిట్‌ చాట్‌ చేసింది. ఇందులో చాలా ఓపెన్ గా రియాక్ట్ అయ్యింది కామాక్షి. తాను బోల్డ్ రోల్స్ కైనా రెడీ అని చెప్పింది. అయితే బోల్డ్ గా చేసినా, సిగ్గు పడుతూ చేసినా అది క్యారెక్టరే అని వెల్లడించింది. 
 

36

ఈ సందర్భంగా యాంకర్‌ మరింత బోల్డ్ గా అడిగాడు, న్యూడ్‌గా కనిపించేందుకు మీరు రెడీనా అని అడగ్గా, నేను నటిని, ఏ పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉండాలి. యాక్టర్‌ లైఫ్‌ అంతే, యాక్టర్‌లాగే చూడాలి. ఎందుకంటే నేను యాక్టర్‌ని, నా వాయిస్‌, నా బాడీ, నా ఫేస్‌, ఇలా ప్రతి ఒక్కటి ఆ పాత్ర కోసం ఒక టూల్‌లా యూజ్‌ చేయాలి. ఇవాలా ఉండి రేపు పోయి ఇమేజ్‌, అందం గురించి నేను పట్టించుకోను అని చెప్పింది. న్యూడ్‌గా అయినా, బోల్డ్ గా అయినా నటించేందుకు సిద్ధమే అని ఓపెన్‌గా వెల్లడించింది కామాక్షి..

46

అంతేకాదు ఐటెమ్స్ సాంగ్స్ గురించి చెబుతూ, తాను కూడా గుడ్‌ డాన్సర్‌ని అని, ఐటెమ్‌ సాంగ్స్ కూడా చేస్తానని, సాంగ్‌ బాగా నచ్చి, బాగా పర్‌ఫెర్మ్ చేసే యాక్టర్ పక్కన డాన్స్ చేయమంటే తాను చేయడానికి సిద్ధమే అని, దర్శకులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆఫర్లు ఇవ్వాలని ఆమె వెల్లడించింది. తాజాగా ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.  

56

కామాక్షి భాస్కర్ల `పొలిమేర` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `పొలిమేర 2`లో మరింతగా పాపులర్‌ అయ్యింది. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు `సైతాన్‌` వెబ్ సిరీస్‌లో బోల్డ్ గా నటించి దుమ్మురేపింది. `ప్రియురాలు` సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్క‌ర్ల‌. `విరూపాక్ష‌`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌`, `రౌడీ బాయ్స్` తో పాటు ఇటీవ‌ల రిలీజైన `ఓం భీమ్ బుష్‌`లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు `దూత2`లోనూ మెరబోతుంది.
 

66

స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన కామాక్షి భాస్క‌ర్ల యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. వెండితెరపై ఎలాంటి పాత్రల్లో అయినా నటించి రక్తికట్టిస్తుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో గ్లామర్‌ విస్పోటనంతో ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె బెడ్‌ సీన్లు అయినా, న్యూడ్‌గా అయినా, ఐటెమ్స్ సాంగ్స్ అయినా చేసేందుకు రెడీ అని చెప్పడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories