యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ వ్యూస్ కోసం చిల్లర వేశాలు వేస్తున్నారు. అలా స్టార్ హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా సునిశిత్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో తెగ హడావిడి చేస్తున్నాడు.
undefined
వన్ సినిమా నుంచి సాహో సినిమా వరకు అన్ని తను చేయాల్సి సినిమాలే అని హీరోలను తనను మోసం చేసి ఆ కథలు తీసుకున్నారని కామెంట్స్ చేశాడు. అదే సమయంలో హీరోయిన్లపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాను ప్రేమించుకున్నామని, పెద్దలు అంగీకరించకపోవటంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని కాపురం పెట్టామని చెప్పాడు. అంతేకాదు లావణ్యకు అబార్షన్ కూడా చేయించానని చిల్లర కామెంట్స్ చేశాడు.
undefined
మరో చానల్‌లో మాట్లాడుతూ తాను తమన్నాను కూడా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే అతడి వ్యాఖ్యలు శృతిమించటంతో లావణ్య త్రిపాఠి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. సునిశిత్ వ్యాఖ్యలపై రాచకొండలో రెండు కేసులతో పాటు, కీసరలో మరో కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సునిశిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
undefined