సీఎం జగన్, మంచు ఫ్యామిలీ నాగబాబుకు గిట్టనివారు, ప్రత్యర్ధులు కాబట్టి... ఎలాంటి సెటైర్స్ వేసినా అర్థం ఉంది. కానీ కన్న కూతురు గౌరవంపై కూడా ఆయన సెటైర్లు వేయడం విమర్శలపాలవుతుంది. ఈ ఇంస్టాగ్రామ్ ఛాట్ లో ఒకరు... నిహారిక (Niharika Konidela)అక్క ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేశారు?.. అంటూ చాలా మర్యాదగా సామరస్యంగా అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం లేకపోతే వదిలేస్తే సరి. ఎందుకంటే ఫ్యాన్స్ పదుల సంఖ్యలో అడిగే ప్రశ్నలలో సెలెబ్రిటీలు కొన్నిటికి మాత్రమే సమాధానం చెబుతారు.