షారూఖ్ వంటి సూపర్ స్టార్ ని బాలీవుడ్ ఫెయిల్యూర్ అవ్వాలని కోరుకుందా అంటే అవుననే అంటున్నారు ఆయనతో పనిచేసిన డైరక్టర్ అనుభవ్ సిన్హా. ఆయన షారూఖ్ తో చేసిన సినిమా రా.వన్. ఆ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అప్పటి విషయాలను రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో గుర్తు చేసుకుంటూ ..షారూఖ్ విషయమై బాలీవుడ్ ఎలా కోరుకుందో చెప్పి ఆశ్చర్యపరిచారు.
సినిమా బాగోలేదని, అందుకే భాక్సాఫీస్ దగ్గర ఫెరఫామ్ చేయలేకపోయిందని, స్క్రిప్టు ,ఎడిటింగ్ ఇలా చాలా డిపార్టమెంట్స్ అసలు బాగోలేదని అన్నారు. కోర్ స్టోరీ బాగుంటుందని, అయితే సినిమా యాంబియన్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేలా సెట్ చేయలేకపోయానని అన్నారు. ఇప్పుడు కనుక సినిమాని సరిచేయాల్సి వస్తే VFX,మ్యూజిక్ తప్పించి అన్ని చేయాలని అన్నారు. నేను అయితే ఈ సినిమా తో షారూఖ్ కు ద్రోహం చేసానని ఫీలవుతున్నానని, ఆయన నమ్మకాన్ని దెబ్బకొట్టానని ఆవేదనతో అన్నారు.