Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..

Published : Jun 06, 2026, 12:29 PM IST

పైరసీ దెబ్బ పెద్దికి కూడా తప్పలేదు. రిలీజ్ కు ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. రామ్ చరణ్ టీమ్ కు షాక్ తప్పలేదు. పెద్దికి హెచ్ డీ క్వాలిటీలో పైరసీ దెబ్బ తగిలింది. మరి నిర్మాతలు ఏం చేయబోతున్నారు. 

PREV
15
ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రస్తుం పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ ప్రాబ్లమ్ ను మాత్రం తప్పిచుకోలేకపోతున్నారు. ఈ సమస్యతో సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల నుంచి కనీసం మూడు లేదా నాలుగు సినిమాలైనా రాకపోతే థియేటర్లు బ్రతికే పరిస్థితి లేదు. థియేటర్లుకు అతి పెద్ద సమస్యగా పైరసీ తయారయ్యింది. ఇప్పటికే పెద్ద సినిమాల కలెక్షన్ల మీద పైరసీ ప్రభావం భారీగా పడుతోంది.

25
పెద్దికి పైరసీ దెబ్బ..

ఈమధ్య కాలంలో వచ్చిన ప్రతీ సినిమాకు మంచి క్వాలిటీలో పైరసీ ప్రింట్ వస్తుండటంతో.. థియేటర్లకు జనాలు రావడం తగ్గింది. పైరసీ ప్రింట్ చూసి సినిమాపై తమ అభిప్రాయాలు చెప్పేస్తున్నాయి. ఈక్రమంలో కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే యాంటీ పైరసీ జాగ్రత్తలు తీసుకున్నా.. లాభం లేకుండా పోతోంది. ఇదేవిధంగా పెద్ది సినిమాకు కూడా పైరసీ దెబ్బ తగిలింది. రిలీజ్ కు ముందు కోర్టును ఆశ్రయించినా.. వారు అభయమిచ్చినా.. పెద్ది పైరసీకి బలికాక తప్పలేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రంపై పరిశ్రమ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది.

35
నిర్మాతలకు అతి పెద్ద తలనొప్పి..

ఈ సినిమా విడుదలయ్యే వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచిన డ్రామా గురించి తెలిసిందే. అది క్లియర్ అయ్యిందనుకుంటే.. మరోవైపు పైరసీ సమస్య నిర్మాతలకు కొత్త తలనొప్పిగా మారింది.ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత పైరసీ మాఫియాపై గట్టి చర్యలు తీసుకోవచ్చని, అక్రమ లీకులకు అడ్డుకట్ట పడుతుందని చాలామంది భావించారు. కానీ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేనట్టే కనిపిస్తోంది. ఇంత జరిగినా.. పైరసీ మాత్రం ఆగడంలేదు సరికదా.. పైరసీ సైట్లకు ముందు కంటే ఉత్సాహం పెరిగిపోయింది.

45
HD క్వాలిటీతో పెద్ది పైరసీ..?

కొన్ని సినిమాలు విడుదలైన రోజే HD క్వాలిటీ ప్రింట్ల రూపంలో ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. పెద్ది కూడా అలాగే రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించినట్లు సమాచారం. విడుదలైన రెండో రోజున కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తున్న టైమ్ లోనే.. HD ప్రింట్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది.

55
సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది.

ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ప్రొడ్యూసర్లకు తెలిసేలా చేస్తున్నారు. పైరసీ ప్రింట్ గురించి మేకర్స్‌కు సమాచారం అందించడంతో.. వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఈ సినిమా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, చిత్రంలోని కొన్ని సన్నివేశాలను విడివిడిగా కట్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో కొందరు అప్‌లోడ్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories