Peddi Hit Target: రామ్ చరణ్ నటించిన అత్యంత ప్రస్టీజియస్ మూవీ `పెద్ది`. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కలెక్షన్లు టార్గెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతనేది చూద్దాం.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `పెద్ది` సినిమాతో రాబోతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గత నెల రోజులుగా వరుసగా ప్రమోషన్స్ తో టీమ్ బిజీగా ఉంది. సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బజ్ రావడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ జోరు కనిపించడం లేదు. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అభిమానుల అంచనాలను ట్రైలర్ అందుకోలేదని అంటున్నారు. అందుకే ఓవర్సీస్ బుకింగ్స్ స్లోగా ఉన్నాయని టాక్. ప్రస్తుతం ఇది ఓవర్సీస్‌లో 750కే డాలర్లు దాటింది. ఒక మిలియన్ దిశగా వెళ్తుంది. అక్కడ రిలీజ్‌కి ఒక్క రోజే ఉంది. అయినా ఇంకా వన్ మిలియన్ టచ్ కాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ హిట్ కావాలంటే దాదాపు ఐదు మిలియన్స్ డాటాలి.
25
పెద్ది ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్
ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ మూవీ `గేమ్ ఛేంజర్`ని దాటలేకపోయింది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం భారీగానే ఉంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.218.50కోట్ల బిజినెస్ అయ్యిందట. నైజాంలో రూ.48కోట్లకు అమ్ముడు పోయింది. సీడెడ్ రైట్స్ రూ.24కోట్లకు అమ్ముడు పోగా, ఉత్తరాంధ్ర రూ.18కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.10.20కోట్లు, వెస్ట్ గోదావరి రూ.8.25కోట్లు, గుంటూరు రూ.11.20, కృష్ణ రూ.9.30కోట్లు, నెల్లూరు రూ.6.30కోట్లకు అమ్ముడు పోయింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.135.25కోట్లు వ్యాపారం జరిగిందట.
35
పెద్ది కలెక్షన్ల టార్గెట్
దీంతోపాటు కర్నాటకలో రూ.17కోట్లు, తమిళనాడులో రూ.5.25కోట్లు, కేరళాలో రెండు కోట్లు నార్త్ లో రూ.25కోట్ల వరకు వ్యాల్యూ కట్టారు. ఓవర్సీస్‌లో రూ.34కోట్లకు సేల్ అయ్యింది. మొత్తంగా రూ.220కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ మూవీకి ఉన్న బజ్ నేపథ్యంలో ఈ టార్గెట్ చాలా పెద్దదే అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.450కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. మరి అది సాధ్యమేనా అనేది ప్రశ్న.
ఫస్ట్ డే టాక్ మీదే నమ్మకం పెట్టుకున్న పెద్ది టీమ్
టీమ్ మాత్రం కంటెంట్‌ని నమ్ముకుంది. ఫస్ట్ డే టాక్‌తోనే ఈ మూవీ పుంజుకుంటుందనే భరోసాతో ఉన్నారు. కంటెంట్ మీద నమ్మకంతోనే ముందుకు సాగుతున్నారు. ఈ మూవీ భవిష్యత్‌లో మొదటి రోజు టాక్ మీదనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అయితే బుచ్చిబాబు మీద నమ్మకం, రామ్ చరణ్ పడ్డ కష్టం మీద అంతా నమ్మకంతో ఉన్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
55
పెద్ది టీమ్, బడ్జెట్ వివరాలు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ చేసింది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ మూవీకి సుమారు రూ.350కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం.