తెలుగులో పవన్ కళ్యాణ్ `బద్రి`, మహేష్‌తో `నాని`, ఎన్టీఆర్‌తో `నరసింహుడు`, బాలయ్యతో `పరమవీర చక్ర` వంటి చిత్రాల్లో నటించి అలరించిన అమీషా పటేల్ ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో స్టార్‌గా రాణించి వెళ్లిపోయింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన మార్క్ చూపించిందని చెప్పొచ్చు. తాజాగా అమీషా పటేల్ 51వ ఏట అడుగుపెట్టారు. ఆమె 1975 జూన్ 9న ముంబైలో జన్మించారు. కెరీర్‌లో ఎక్కువ హిట్లు లేకపోయినా, ఆమె కోట్లాది రూపాయల ఆస్తికి యజమానురాలు. ఆమె వద్ద అదిరిపోయే కార్ కలెక్షన్ కూడా ఉంది.
26
అమీషా పటేల్ ఆస్తి విలువ
అమీషా పటేల్ గత 26 ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆమె గట్టిగానే సంపాదించింది. గ్లామర్‌తో సోషల్ మీడియాని షేక్ చేసే అమీషా రూ. 280 కోట్ల ఆస్తికి యజమానురాలు కావడం విశేషం. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్టేజ్ షోలు, అద్దె ప్రాపర్టీల ద్వారా ఆమె ప్రతినెలా కోట్లలో సంపాదిస్తున్నారు. ఆమె నెలవారీ ఆదాయం రూ. 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. వార్షిక ఆదాయం సుమారు రూ. 25 కోట్లు. ఒక్కో షోకు ఆమె రూ. 50 నుంచి 80 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట.
36
అమీషా పటేల్ ఆస్తులు
అమీషా పటేల్‌కు ముంబైలోని పాలీ హిల్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. మన హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ లాంటి ఈ ఖరీదైన ప్రాంతంలోని ఇంటిని ఆమె స్వయంగా డిజైన్ చేసుకున్నారు. ఇందులో ఇటాలియన్ ల్యాంప్స్, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్, వింటేజ్ డెకరేషన్ వస్తువులు ఉన్నాయి. ఇది కాకుండా, ఇక్కడే ఆమెకు పలు ప్రీమియం రెంటల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.
అమీషా పటేల్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 1.38 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ (రూ. 1.88 కోట్లు), ఆడి క్యూ7 (రూ. 83.91 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్ (రూ. 68.90 కోట్లు), టయోటా ఫార్చ్యూనర్ (రూ. 33.64 లక్షలు), కియా కార్నివాల్ (రూ. 52.42 లక్షలు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
56
అమీషా పటేల్ ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు?
అమీషా పటేల్ 2000 సంవత్సరంలో వచ్చిన 'కహో నా ప్యార్ హై' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే సంచలనం సృష్టించింది. ఈ సినిమా 92 అవార్డులను గెలుచుకుంది, ఇది ఒక రికార్డు.
66
అమీషా పటేల్ హిట్ సినిమాలు
అమీషా పటేల్ తన 26 ఏళ్ల సినీ కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించారు, కానీ హిట్టయ్యింది కేవలం 5 మాత్రమే. ఆమె హిట్ చిత్రాలలో 'కహో నా ప్యార్ హై', 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', 'హమ్‌రాజ్', 'భూల్ భులయ్యా', 'గదర్ 2' ఉన్నాయి. తెలుగులో `బద్రి` ఒక్కటే ఆడింది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద సినిమాలేవీ లేవు. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం ఆమె చేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు.