ట్రెండ్ అవుతున్న వకీల్ సాబ్ డివోషనల్ లుక్... ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ సూపర్!

First Published Jan 22, 2021, 1:31 PM IST

పవర్ స్టార్ పవన్ ఎలా కనిపించినా ట్రెండే.  ఆయన్ని దేవుడిలా పూజించే వీరాభిమానులు ప్రతి విషయాన్ని హైలెట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 

తిరుమల ఆలయ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆధ్యాత్మిక గెటప్ లో కనిపించారు.  ఆయన పంచెకట్టు, ఒంటిపై ధోవతితో సాంప్రదాయ వస్త్ర ధారణలో దర్శనం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తాజా ఫోటోలు సోషల్  మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
undefined
పవన్ కళ్యాణ్ డివోషనల్ లుక్ ని, ఆయన ఫ్యాన్స్ మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. అద్భుతమైన మార్పింగ్స్ తో  ఫోటోలను మరింత ఆకర్షిణీయంగా మలుస్తున్నారు.
undefined
అసలు ఫోటో బ్యాక్ గ్రౌండ్ తీసివేసి,  తమకు నచ్చిన ఆకర్షణీయమైన ఎడిటింగ్స్ తో తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఆ విధంగా పవన్ పై తమ అభిమానం చాటుకుంటున్నారు.
undefined
మరో వైపు పవన్ వరుసగా చిత్రాలు ప్రకటించారు. పవన్ నటించిన వకీల్ సాబ్ వేసవి కానుకగా విడుదల కానుంది. సంక్రాంతి సంధర్భంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది.
undefined
ప్రస్తుతం పవన్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తారని సమాచారం.
undefined
అలాగే మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
undefined
వీటితో పాటు దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక చిత్రం, సురేంధర్ రెడ్డితో మరొక చిత్రం పవన్ కళ్యాణ్ చేయాల్సివుంది.
undefined
click me!