ఉస్తాద్ భగత్ సింగ్ పై ఏపీ ప్రభుత్వం జీవో, పెరిగిన టికెట్ ధరలు ఇవే.. అక్కడ బెనిఫిట్ షో చూసే అభిమానులకు పండగే

Published : Mar 13, 2026, 09:33 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తర్వాత పవన్ నటించిన మూవీ ఇదే. తాజాగా ఈ చిత్ర టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 

PREV
15
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్చి 26న రావాల్సిన ఈ చిత్రాన్ని ఇంకా ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. దీనితో ఉగాది పండుగ ఈ చిత్రానికి కలసి రానుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఇన్నేళ్లకు పవన్, హరీష్ కాంబోలో రూపొందిన చిత్రం ఇదే. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.

25
టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం జీవో

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ఉస్తాద్ చిత్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మూవీ టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ప్రీమియర్ షోల ప్రస్తావన లేదు. అంటే ఈ చిత్రానికి ప్రీమియర్స్ ఉండవు అనే భావించాలి.

35
10 రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు

మార్చి 19 నుంచి పది రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు అమలులో ఉంటాయి. ప్రీమియర్ షోలకు బదులుగా మార్చి 19 తెల్లవారు జామున బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకు టికెట్ ధరని రూ 500 గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు పెంచుకునేలా, మల్టిప్లెక్స్ లో 125 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

45
టికెట్ ధరల వివరాలు

పెరిగిన టికెట్ ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

బెనిఫిట్ షో టికెట్ ధర: రూ.500 (జీఎస్టీతో కలిపి)

సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధర : రూ 247

మల్టీప్లెక్స్ టికెట్ ధర: రూ.302

పెరిగిన టికెట్ ధరలు పదిరోజుల పాటు అంటే మార్చి 28 వరకు అమలులో ఉంటాయి.

55
అక్కడ బెనిఫిట్ షో చూసేవాళ్లకు పండగే

ఓజీ మూవీ ప్రీమియర్ షోలకు టికెట్ ధర 800 గా నిర్ణయించారు. దానితో పోల్చితే ఉస్తాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తక్కువే అని చెప్పాలి. ఏపీలో ఉస్తాద్ బెనిఫిట్ షో చూడాలి అనుకునే అభిమానులకు ఇది మంచి వార్తే.

Read more Photos on
click me!

Recommended Stories