ఈ వర్క్ షాప్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో సూపర్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్ ఇదే అని చెప్పొచ్చు. రెడ్ టీ షర్ట్, జీన్స్ లో పవన్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పవన్ లుక్ తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీరమల్లు హంగామా మొదలు పెట్టారు. లెజెండ్రీ సంగీత దర్శకులు కీరవాణి, దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం, నటుడు సుబ్బరాజు. రఘు బాబు, నిధి అగర్వాల్, ఇతర టెక్నికల్ టీం పాల్గొన్నారు.