Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?

Published : May 03, 2026, 08:27 PM IST

పవన్ కళ్యాణ్ ఓ చిన్నారికి ఎంతో అర్థవంతమైన, శక్తివంతమైన పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడానికి పవన్ కళ్యాణ్ వారం టైం తీసుకున్నారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ముక్కుకి సర్జరీ జరగడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే పవన్ ప్రజాజీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాలు చేస్తూనే రాజకీయాలు కూడా కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హిందూ సంస్కృతులు, భావాలని బలంగా విశ్వసిస్తున్నారు.

25
ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు

ఆయన కార్యక్రమాలు, రాజకీయ పరమైన స్టీజీలపై కూడా హిందూ భావజాలం కనిపిస్తోంది. జనసేన పార్టీనేత, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిన్న కుమార్తెకి పేరు పెట్టమని పవన్ కళ్యాణ్ గారిని రిక్వస్ట్ చేశాను. సరే పెడతాను అన్నారు. వారం రోజులు ఆయన్ని కలుస్తూనే ఉన్నా, ఏమీ చెప్పడం లేదు. వారం తర్వాత ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు.

35
చాలా మీనింగ్ ఫుల్ గా పేరు పెట్టారు

పేరు చెబుతున్నా రాసుకో అని అన్నారు. 'అమాని రాజ్యదాయిని' అని పెట్టారు. చాలా మీనింగ్ ఫుల్ గా ఆయన అలోచించి ఆ పేరు పెట్టారు. జస్ట్ రాజ్యదాయిని అని పెట్టొచ్చు.. కానీ పెద్దయ్యాక ఆ పాప నన్ను తిట్టుకుంటుంది. అందుకే ముందు ట్రెండీగా ఉండేలా అమాని అని పెట్టినట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

45
రాజ్యాన్ని ఏలే అమ్మాయి కావాలి

మా నాన్న పేరు వసంతరావు. అమానీ అంటే కూడా వసంతమే. అందుకే కళ్యాణ్ గారు ఆ పేరు పెట్టారు. రాజ్యదాయిని అంటే ఫ్యూచర్ లో రాజ్యాన్ని ఏలే అమ్మాయి కావాలి అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు.

55
ఎంతో లోతుగా ఆలోచిస్తారు

పాపకి పేరు పెట్టడానికి కూడా కళ్యాణ్ గారు ఒక బాధ్యతలా భావించి టైం తీసుకుని చేశారు. ప్రతిదీ ఆయన ఎంతో లోతుగా ఆలోచిస్తారు అని ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories