
పవన్ కళ్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో సినిమాలు పూర్తి చేయడం పెద్ద టాస్క్ గా మారింది. ఆయన ఒప్పుకున్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ క్రేజీ వార్త వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ తీసుకునే పారితోషికం ఎప్పుడూ పెద్దగా చర్చకు రాదు. ఆయన తనతోటి టాప్ స్టార్స్ కంటే తక్కువగానే తీసుకుంటారు. ఒకప్పుడు ఫామ్‌లో ఉన్నప్పుడు పోటీ పడ్డారు తప్ప, ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ వచ్చాక వందల కోట్ల పారితోషికాలు అయ్యాక ఆ విషయంలో పవన్ పోటీలో లేరు. కానీ ఇప్పుడు సడెన్‌గా పవన్ పారితోషికం టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. `హరిహర వీరమల్లు`, `ఓజీ` మూవీ, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలున్నాయి. ఇందులో `హరిహర వీరమల్లు`, `ఓజీ` సినిమాలను ముందుగా పూర్తి చేయాలని పవన్ చూస్తున్నారు.
ఆయన ఎంత ప్రయత్నించినా, ఏదో రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. `హరిహర వీరమల్లు` మూవీని మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాని కారణంగా మళ్లీ వాయిదా పడింది.
ఆ తర్వాత `ఓజీ` పూర్తి చేయాల్సి ఉంది పవన్. దీనికి సుమారు 15 రోజుల పవన్ కాల్షీట్లు కావాల్సి ఉంది. ఈ మూవీ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఈ క్రమంలో ఇప్పుడు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించే `ఉస్తాద్ భగత్ సింగ్`కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వినిపిస్తుంది. ఈ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.
మామూలుగా అయితే ఈ ప్రాజెక్ట్ ఉండబోదనే రూమర్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ వార్త ప్రకారం ఈ సినిమా ఉంటుందని, ఈ ఏడాది చివర్లో పవన్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని, వచ్చే ఏడాది మిడిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అయితే ఈ మూవీకి సంబంధించిన పవన్ పారితోషికం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికోసం పవన్ ఏకంగా రూ.170కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. డెక్కన్ క్రొనికల్ ఈ విషయాన్ని ప్రచురించింది. అయితే ఈపారితోషికం నమ్మేలా లేదు. బహుశా ఇది రెండు పార్ట్ లుగా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా ఇప్పుడు పవన్ పారితోషికం హాట్ టాపిక్ అవుతుంది. ఇదే నిజమైతే ప్రభాస్, అల్లు అర్జున్‌లను మించిన పవన్ పారితోషికం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి బిగ్ కమర్షియల్ స్టార్స్ కి పవన్ ఝలక్ ఇచ్చాడంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి వచ్చే కిక్ వేరబ్బా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో శ్రీలీలా హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు హరీష్. మొదట ఇది తమిళ `తెరి` రీమేక్ అన్నారు. కానీ ఇప్పుడు కథమొత్తం మార్చేశారట హరీష్. పవన్ సూచనల మేరకు కొత్త కథని రెడీ చేశారని సమాచారం.