OG A Certificate : పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ లో తొలగించిన సన్నివేశాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 24 సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల సందడి మొదలవుతుంది ప్రీమియర్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. ముందుగా ఏపీ ప్రభుత్వం అర్థరాత్రి 1 గంట బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఆ జీవోలో మార్పులు చేసి తాజాగా 24 రాత్రి 10 గంటల బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది.
25
ఓజీ చిత్రానికి A సర్టిఫికెట్
ఇక తెలంగాణలో రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. రిలీజ్ కి సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఓజీ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. వయలెన్స్, రక్తపాతానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ఇచ్చారు.
35
సినిమాపై ప్రభావం పడకూడదనే..
చిత్ర యూనిట్ మాత్రం యు/ఎ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించారు. యు/ఎ సర్టిఫికెట్ కావాలంటే చాలా కట్స్ అవసరం అని సెన్సార్ బోర్డు సూచించిందట. కీలక సన్నివేశాల్లో కట్స్ పడితే సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ పై ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ భావించింది. అందుకే కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ కి అంగీకారం తెలిపారు.
పంజా మూవీ తర్వాత ఎ సర్టిఫికెట్ పొందిన పవన్ కళ్యాణ్ మూవీ ఓజీనే. సెన్సార్ తర్వాత ఓజీ ఫైనల్ రన్ టైం 2 గంటల 34 నిమిషాలుగా లాక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కనీ వినీ ఎరుగని అంచనాలతో ఓజీ మూవీ రిలీజ్ అవుతోంది. సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ గమనిస్తే ఈ చిత్ర క్లైమాక్స్ ఊహకందని వయలెన్స్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో 2 గంటల 15 నిమిషాల తర్వాత సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పింది.
55
సెన్సార్ లో తొలగించిన నిడివి
అదే విధంగా తొలి 40 నిమిషాల్లో కూడా కొన్ని కట్స్ ఉన్నాయి. అదే విధంగా సినిమాలో 1 గంట 12 నిమిషాల తర్వాత ఏకంగా 1 నిమిషం నిడివి సన్నివేశాలని కట్ చేశారు. అంటే అవి ఇంటర్వెల్ సన్నివేశాలు అని చెప్పొచ్చు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ లో ఊచకోత ఉండబోతోందని దీనిని బట్టే అర్థం అవుతోంది. ఓవరాల్ గా సెన్సార్ బోర్డు 1 నిమిషం 55 సెకన్ల ఫుటేజ్ కట్ చేసింది.