ఇందులో పవన్ కళ్యాణ్ చెబుతూ, `34ఏళ్ల తర్వాత తమిళనాడుకి చెందిన తిరు రెన్షి రాజా అవర్‌ని కలుసుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. 1990 ప్రారంభంలో ఆయన నాకు సీనియర్.
షిహాన్ హుస్సేని అవర్ సారథ్యంలో ఆయన కూడా శిక్షణ పొందారు. ఆయన అప్పటికే బ్లాక్ బెల్ట్ పొందారు. నేను ఇంకా గ్రీన్ బెల్ట్ లోనే ఉన్నాను. మేం శిక్షణ పొందిన కరాటే పాఠశాలకు ఇప్పుడు ఆయన నాయకత్వం వహిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది.
షిహాన్ దార్శనికతను అంకిత భావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. షిహాన్ హుస్సేనితో మా దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, మార్షల్ ఆర్ట్స్ పట్ల మాకున్న ఉమ్మడి అభిరుచిని చర్చించడం వల్ల అనేక పాత జ్ఞాపకాలను తిరిగి పొందాం` అని తెలిపారు పవన్ కళ్యాణ్.