పవన్ ని ఎప్పుడూ ఇలా చూసి ఉండరేమో.. పట్టలేని ఆనందంలో అభిమానులు.. `హరిహర వీరమల్లు` రెండో రోజు వర్క్ షాప్‌..

Published : Oct 01, 2022, 08:50 PM ISTUpdated : Oct 01, 2022, 11:29 PM IST

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సినిమాల పట్ల తన డెడికేషన్‌ని చూపిస్తున్నారు. వరుసగా వర్క్ షాప్‌లు నిర్వహిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ప్రస్తుతం రెండో రోజు వర్క్ షాప్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
17
పవన్ ని ఎప్పుడూ ఇలా చూసి ఉండరేమో.. పట్టలేని ఆనందంలో అభిమానులు.. `హరిహర వీరమల్లు` రెండో రోజు వర్క్ షాప్‌..

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు యాభై శాతం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తుంది. చాలా రోజుల క్రిత చిత్ర షూటింగ్‌ ఆగిపోయింది. అనేక అవాంతరాలు సినిమాని వెంటాడుతున్నాయి. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో డేట్స్ కేటాయించలేకపోతున్నారు. మరోవైపు స్క్రిప్ట్ వైపు కొన్ని మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కారణాలేమైనా సినిమా వాయిదా పడి చాలా రోజులవుతుంది.
 

27

క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ని మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది యూనిట్. దీనికి పవన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ముందస్తు ప్లాన్‌ సిద్ధం చేసింది యూనిట్‌. షూటింగ్‌లో టైమ్‌ వేస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తుగానే వర్క్ షాప్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ వర్క్ షాప్‌ ప్రారంభమైంది. 

37

నేడుశనివారం రెండో రోజుకి చేరుకుంది. ఇందులో సీన్‌ బై సీన్‌, ప్రతి విషయాన్ని డిటెయిల్స్ గా చర్చిస్తున్నారు. ఏ సీన్‌లో ఏం చేయాల్సి ఉంటుంది, ఎలా చేయాల్సి ఉంటుందనేది ముందుగానే డిస్కస్‌ చేసుకుంటున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొంటుండటం విశేషం. 

47

పవన్‌తోపాటు దర్శకుడు క్రిష్‌, నిర్మాతలు ఏఎం రత్నం, ఏ దయాకర్‌ రావులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా పాల్గొంటున్నారు. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ కూడా ఈ వర్క్ షాప్‌లో పాల్గొంటూ ప్రతి సీన్‌ని చర్చిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ వర్క్ షాప్‌ జరుగుతుండటం విశేషం. 
 

57

ఈ సందర్భంగా `హరిహర వీరమల్లు` చిత్ర వర్క్ షాప్‌కి సంబంధించి తీసిన ఫోటోలను విడుదల చేసింది యూనిట్‌. ఇవి ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పవన్‌ ఈ సినిమా కోసం ఈ రేంజ్‌లో వర్క్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులంతా ఖుషీ అవుతున్నారు. ఆనందంలో మునిగి తేలుతున్నారు. 
 

67

ఈ సినిమా షూటింగ్‌ని అక్టోబర్‌రెండో వారంలో ప్రారంభించబోతున్నారు. భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారని, ఆల్మోస్ట్ షూటింగ్‌ ఇందులో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ పాత్ర పార్ట్ ని పూర్తి చేసే పనిలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. రెండో రోజు వర్క్ షాప్‌లో యాక్షన్‌కి సంబంధించి ఫైట్‌ మాస్టర్‌ విజయ్ మాస్టర్‌ ఉన్నారు. యాక్షన్‌ సీన్లపై వర్క్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే టెక్నీకల్‌ టీమ్‌ కూడా ఉన్నారు. మొదటి రోజు ఆర్టిస్టులు పాల్గొన్న విషయం తెలిసిందే. 
 

77

ఈ సినిమాని పాన్‌ ఇండియా తరహాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయేలా సినిమాని రూపొందించబోతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ సైతం అంతే స్థాయిలో సినిమాని తెరపై ఆవిష్కరించేందుకు సన్నద్దమవుతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories