Anu Emmanuel: హాట్ లిప్స్ క్యూట్ లుక్స్... రెచ్చగొట్టే పోజుల్లో అను ఇమ్మానియేల్!

First Published | Oct 5, 2023, 7:43 AM IST

అను ఇమ్మానియేల్ అరుదుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 

Anu Emmanuel


చూడగానే కట్టిపడేసే రూపం అను ఇమ్మానియేల్ సొంతం. చెప్పాలంటే సూపర్ హాట్ బ్యూటీ. అను గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ ఫోటోలు పంచుకుంది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 
 

Anu Emmanuel

అను ఇమ్మానియేల్ కి కాలం కలిసి రాలేదు. కెరీర్ బిగినింగ్ లో నానికి జంటగా నటించిన మజ్ను మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినా ఆమె ఫేట్ మారలేదు.  


Anu Emmanuel

 గత ఏడాది ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకులను పలకరించింది. హీరో శిరీష్ తో విచ్చలవిడి రొమాన్స్ చేసింది. వీరి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొహమాటం లేకుండా నటించినా ఫలితం మాత్రం శూన్యం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. 

Anu Emmanuel

అయితే  అనుకి అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రవితేజకు జంటగా రావణాసుర చిత్రం చేసింది. ఇది కూడా డిజాస్టర్. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ కూడా ఆమెను కాపాడలేకపోయాడు.  ఇక తెలుగులో అను ఇమ్మానియేల్ కి ఆఫర్స్ రావడం కష్టమే. 

అయితే కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో జపాన్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల విజయాలపై అను ఇమ్మానియేల్ కెరీర్ ఆధారపడి ఉంది. జపాన్ కూడా పరాజయం పొందితే అను ఇమ్మానియేల్ పరిశ్రమ నుండి సర్దుకున్నట్లే. 

ఆ మధ్య ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ మధ్య  అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఇద్దరూ ముంబైలో మకాం పెట్టారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ పై అను ఇమ్మానియేల్ స్పందించారు. ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ చిత్ర పూజా సెరిమోని రోజు పరిచయమయ్యారు.

అల్లు శిరీష్ తో నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ,సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించాను. అప్పటి నుండి అల్లు అరవింద్ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉందని గతంలో చెప్పుకొచ్చారు.

Latest Videos

click me!