Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మినీ లాంచ్ ఈవెంట్... హౌస్లోకి మరో 6గురు టాప్ సెలబ్స్?

First Published | Oct 5, 2023, 7:04 AM IST

బిగ్ బాస్ సీజన్ 7లో కీలక పరిణామం చోటు చేసుకోనుందనే ప్రచారం జరుగుతుంది. ఏకంగా మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 6గురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారట. 
 

Bigg Boss Telugu 7

గత ఆరు సీజన్లో ఎన్నడూ లేని విధంగా కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో మొదలైంది. సాధారణంగా 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ తో షో లాంచ్ చేస్తారు. సీజన్ 7లో వివిధ కారణాలతో అతి తక్కువ మంది హౌస్లోకి వెళ్లారు. వీరిలో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్  నాలుగు వారాల్లో ఇంటిని వీడారు. రతికా ఎలిమినేషన్ అనంతరం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, శివాజీ, సందీప్, ప్రియాంక ఉంటారు. 
 

Bigg Boss Telugu 7

ఈ క్రమంలో ఒకేసారి ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఈవెంట్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ద్వారా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపనున్నారట. గతంలో ఎన్నడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుందని అంటున్నారు.
 


Bigg Boss Telugu 7

 మరి ఆ ఆరుగురు  కంటెస్టెంట్స్ ఎవరంటే... జబర్దస్త్ కెవ్వు కార్తీక్ అట. అలాగే సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని అంటున్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది తాజా సమాచారం. 

Pooja Murthy

నాగార్జున పరోక్షంగా ఇదే విషయం వెల్లడిస్తున్నారు. ఈ సీజన్లో అంతా ఉల్టా పల్టా, ఎవరు ఊహించని సంఘటనలు జరుగుతాయని అంటున్నారు. వీరిలో కొందరు సీజన్ ఆరంభంలోనే బిగ్ బాస్ షోకి రావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వెనక్కి తగ్గారు. ముఖ్యంగా పూజా మూర్తి తండ్రి మరణంతో చివరి నిమిషంలో ఆగాల్సి వచ్చిందట. ఇక మినీ లాంచ్ ఈవెంట్ పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 
 

లిస్ట్ లో ఉన్న ఆరుగురిలో ఎక్కువ మంది సీరియల్ నటులే కావడం విశేషం. నిజంగా వీరు హౌస్లోకి వెళితే సీరియల్ బ్యాచ్ శక్తి పెరిగే అవకాశం ఉంది. ప్రతి సీజన్ కి హౌస్లో రెండు మూడు గ్రూప్ లు ఏర్పడతాయి. ఈసారి సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ గా హౌస్ నడిచే అవకాశం ఉంది. ఆల్రెడీ శివాజీ తన వ్యతిరేకత వాళ్లపై ప్రకటించాడు. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో తన గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక చూడాలి ఏం జరగనుందో... 
 

Latest Videos

click me!