స్పేస్‌ సైంటిస్ట్ కాబోయి నటిగా మారానుః రేణు భావోద్వేగం

First Published Sep 10, 2020, 3:23 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, దర్శకురాలు, నటి రేణు దేశాయ్‌ తన తొలి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. స్పేస్‌ సైంటిస్ట్ కావాలనుకుని నటిగా మారానని చెబుతోంది. తాను కెమెరా ముందుకొచ్చి పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. 

సినిమాల కోసం తాను ఫస్ట్ టైమ్‌ దిగిన ఫోటో షూట్‌ ఫోటోలను రేణు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తాను తొలినాళ్ళలో ఎలా ఉన్నానో తెలిపింది. ఇందులో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది రేణు. తనకి సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదట. స్పేస్‌ సైంటిస్ట్ గానీ, లేదంటే న్యూరో సర్జన్‌ కావాలని అనుకుందట. కానీ డెస్టినీ మరోలా తీసుకెళ్ళిందని తెలిపింది.
undefined
తాను మొదటిసారి 16ఏళ్ళ వయసులో కెమెరా ముందుకొచ్చినట్టు తెలిసింది. ఈ లెక్కన ఆమె 1995 సెప్టెంబర్‌9న ఫస్ట్ టైమ్‌ కెమెరాని ఫేస్‌ చేసిందట. ఆ తర్వాత సినిమా రంగంతో ప్రేమలో పడ్డానని తెలిపింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక తన జీవితం ఎలా సాగిందో అందరికి తెలిసిందే అని పేర్కొంది.
undefined
`అంతరిక్ష శాస్త్రవేత్తగానో, డాక్టర్‌గానే స్థిరపడాలని చిన్నప్పుడు కలలు కన్నాను. విధి నా జీవితాన్నే మార్చేసింది. నాసాలో జాయిన్‌ అయి సైంటిస్ట్గా మారాలనుకున్న నా కలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. చాలా సంవత్సరాలు ఆ బాధ నన్ను వెంటాడింది` అని రేణు పేర్కొంది.
undefined
సినిమాలు చేయడం వల్ల, సినిమాలు తీయడంపై నాకు ప్రేమ పెరిగే కొద్ది భౌతికశాస్త్రం, గణితంపై ఉన్న ప్రేమ తగ్గిపోయింది. సంతృప్తి చెందింది. ఇకపై దర్శకురాలిగా మిమ్మల్నికచ్చితంగా అలరిస్తాను. ఇష్టపూర్వకంగా కష్టపడి పనిచేస్తే విజయం, ఆనందం మీదే అని కచ్చితంగా హామీ ఇస్తున్నా` అని తెలిపింది.
undefined
ఈ సందర్భంగా రేణు పంచుకున్న తొలినాటి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. రేణు దేశాయ్‌ మొదటగా మోడల్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
undefined
2000లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన `బద్రి` చిత్రంలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత `జేమ్స్ పండు`, `జానీ` చిత్రాల్లో నటించింది. పవన్‌ నుంచి విడాకులు తీసుకున్నాక దర్శకురాలిగా మారి, `ఇష్క్ వాలా లవ్‌` చిత్రాన్ని తెరకెక్కించి మెప్పించలేకపోయింది.
undefined
వీటితోపాటు `ఖుషి`, `జానీ`,`గుడుంబా శంకర్‌`, `బాలు`,`అన్నవరం` సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, `ఖుషి`, `బాలు`కి సాంగ్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. `ఇష్క్ వాలా లవ్‌`కి నిర్మాతగానూ వ్యవహరించారు.
undefined
click me!