ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తూ పుణేలో పిల్లలను పెంచి పెద్ద చేశారు. కొడుకు అకీరా, కూతురు ఆద్య టీనేజ్ వయసులో ఉన్నారు. అకీరా టీనేజ్ దాటకుండానే ఆరున్నర అడుగులకు చేరుకోవడం విశేషం.
ఇటీవలే నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రేణూ దేశాయ్. కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర సీరియల్స్ లో రేణూ దేశాయ్ నటిస్తున్నారు. కెరీర్ కోసం నివాసం హైదరాబాద్ కి మార్చడం జరిగింది.
నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న రేణు దేశాయ్ తన పర్సనల్ విషయాల గురించి కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజా ఇంటర్వ్యూలో పిల్లలు ఆద్య, అకీరాలతో తనకు వస్తున్న చిన్న చిన్న సమస్యలు తెలియజేశారు.
ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఇంట్లో పూజ చేస్తారట రేణూ దేశాయ్. ఆ సమయంలో ఎక్కడ ఉన్నా పూజలో పాల్గొనాలి అనేది రేణు రూల్ అట. యితే ఆ రూల్ పిల్లలకు నచ్చదట.
అకీరా, ఆద్య కొన్నిసార్లు ఆడుకుంటూ పూజలో పాల్గొడానికి ఇష్టపడరట. ఆ విషయంలో ఇద్దరూ తనతో గొడవపడతారని రేణూ తెలియజేశారు. ఏడున్నరకు పూజ ముగించి, వెంటనే డిన్నర్ చేసి పడుకోవాలనేది రేణూ ఇంటిలో ఉన్న పద్దతి అట.
ఇక కొన్నాళ్లక్రితం వరకు పవన్ అంటే రేణూ అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు. పిల్లలకు తండ్రిగా పవన్ పేరు చెప్పినా ఊరుకునేవారు కాదు. ఈ మధ్య ఆమె పవన్ కి దగ్గిరయ్యారని ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలుస్తుంది.
గతంలో ఓ వ్యక్తితో రేణు ఎంగేజ్మెంట్ జరుపుకోవడం జరిగింది. రేణూ రెండో పెళ్లిని పవన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణం ఏదైనా కానీ, రేణూ రెండో పెళ్లి ఆలోచన వదిలేశారు.