పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేధింపులతో కృంగిపోయిన రేణు దేశాయ్... ఎవరూ ఊహించని నిర్ణయం!

Published : Jun 27, 2024, 10:43 AM IST

సోషల్ మీడియా వేధింపులతో రేణు దేశాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను ఎంతగా వేధిస్తే ఆమె అలా చేశారనే వాదన మొదలైంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

PREV
16
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేధింపులతో కృంగిపోయిన రేణు దేశాయ్... ఎవరూ ఊహించని నిర్ణయం!
Renu Desai


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో రేణు దేశాయ్ కి ఎప్పుడు సమస్యలే. కొన్నేళ్ల క్రితం రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రకటన చేసింది. దాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. రేణు దేశాయ్ కి సోషల్ మీడియా వేధింపులు ఎదురయ్యాయి. 

 

26
Pawan Kalyan and Akira Nandan

అకీరా, ఆద్య మా అన్నయ్య పిల్లలు. అకీరాని దాచకండి. మాకు చూపించండని రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ క్రింద తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. పెంచి పెద్ద చేసిన తల్లిగా వారి కామెంట్స్ ని రేణు దేశాయ్ సహించేవారు కాదు. చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యేవారు. 

36


ఇటీవల మరలా రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తొందర పడి దేవుడు లాంటి అన్నయ్యను వదిలేశావు... లేదంటే డిప్యూటీ సీఎం భార్యగా నీకు మంచి భవిష్యత్తు ఉండేదని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. నేను ఆయన్ని వదిలేయలేదు. ఆయనే నన్ను వదిలేసి వేరే వివాహం చేసుకున్నారని రేణు దేశాయ్ కౌంటర్ ఇచ్చింది. 

 

46

అలాగే పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాలతో అకీరా, ఆద్య ఫోటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని షేర్, ఎడిట్ చేస్తూ రేణు దేశాయ్ టార్గెట్ గా దారుణమైన ట్రోల్స్ చేశారు. ఆద్య కూడా మానసిక వేదనకు గురైందని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఆక్రోశం వ్యక్తం చేసింది. 

56
photo credit prema interview

వరుస సంఘటనల నేపథ్యంలో రేణు దేశాయ్ మానసికంగా కృంగిపోతున్నారు. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ కి దూరం అవుతున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం అన్నారు. 

 

66
Renu desai

అయితే ఇంస్టాగ్రామ్ మాత్రం డిలీట్ చేయలేనని రేణు దేశాయ్ అన్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా నేను సామాజిక సేవ చేస్తున్నాను. కాబట్టి ఆ అకౌంట్ డిలీట్ చేయలేనని ఆమె వెల్లడించారు. ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ని శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు తెలియజేశారు. రేణు దేశాయ్ నిర్ణయం ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒకింత వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories