Hari Hara Veera Mallu : సెట్లో నవమి పూజ జరిపిన పవన్ కళ్యాణ్ (ప్రత్యేక ఫొటోలు)

Surya Prakash   | Asianet News
Published : Apr 10, 2022, 11:29 AM IST

 ఇవాళ శ్రీరామ నవమి నేపథ్యంలో.. ” హరిహర వీరమల్లు” సెట్‌ లో వేడుకలు జరిగాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కూడా వీరమల్లు గెటప్‌ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

PREV
19
Hari Hara Veera Mallu : సెట్లో  నవమి పూజ జరిపిన పవన్ కళ్యాణ్  (ప్రత్యేక ఫొటోలు)
Hari Hara Veera Mallu


రీసెంట్ గా భీమ్లానాయక్ చిత్రంతో హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం స్పీడు పెంచారు. పవన్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మళ్లీ మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు సెట్ లోని  శీరామ నవమి వేడుకలు జరిపారు. ఆ ఫొటోలు ఇప్పుడు అభిమానులకు ఆనందం పంచుతున్నాయి.

29
Hari Hara Veera Mallu


ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తాజాగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. పవన్ కళ్యాణ్ స్వయంగా శ్రీరాముడి పటానికి పూజా చేసి, హారతి ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు క్రిష్ తో పాటు చిత్ర టీమ్  మొత్తం పాల్గొంది.

39
Hari Hara Veera Mallu


“హరి హర వీర మల్లు” సెట్స్ లో జరిగిన శ్రీరామ నవమి ప్రత్యేక పూజకు సంబంధించిన పిక్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేముందు ఈ పూజను నిర్వహించారు.

49
Hari Hara Veera Mallu



ఇంతకు ముందు నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్ మూవీ రూపొందించి విజయం సాధించారు క్రిష్. ఆ అనుభవంతోనే ఈ సారి కూడా ‘హరి హర వీరమల్లు’లో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యాన్ని ఎంచుకున్నారు.

59


ఇందులో మొఘల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ‘హరి హర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అందుకోసం ఆయన పోరాట సన్నివేశాల సాధన చేశారు. అప్పుడు తీసిన వీడియోనే ఇప్పుడు ఇలా సందడి చేస్తోంది.

69


ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్  హీరోయిన్. “హరిహర వీర మల్లు” సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది.

79


ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు మరోసారి పదును పెడుతున్న విషయం తెలిసిందే.  

89

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది పవర్ స్టార్ రాబోయే చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). 17వ శతాబ్దానికి  చెందిన ప్రాచీన కథతో ప్రేక్షకులను అలరించేందుకు డైరెక్టర్ క్రిష్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. ఈ మేరకు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేందుకు మళ్లీ రెడీ అయ్యారు. 
 

99

పాత్రకు అనుగుణంగా తన బాడీని తయారు చేసుకోవడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పవన్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశాడు పవర్ స్టార్. భీమ్లానాయక్ పాత్ర నుంచి వీరమల్లుగా పవన్ మేక్ ఓవర్ ఆకట్టుకుంటోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories