పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ శంకర్‌ సినిమా కథ ఇదేనా..ఓ మైగాడ్‌ ఫస్ట్ టైమ్‌ పవన్‌ అలా? ఫ్యాన్స్ కి గూస్‌బమ్స్

First Published | May 4, 2021, 6:04 PM IST

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా లీకేజ్‌ న్యూస్‌ వైరల్‌గా మారింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ టైమ్‌ అలా కనిపించబోతున్నాడట. అలా పవన్‌ని చూసి ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోవాల్సిందే అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ తర్వాత ఇటీవల `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటించారు. ఈ సినిమా విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. కరోనా ప్రభావం దీనిపై పడింది. తొలి వారంలోనే వంద కోట్ల మార్క్ ని రీచ్‌ అయ్యిందీ సినిమా. కానీ కరోనా వల్ల థియేటర్లు మూతపడటం, ఆడియెన్స్ తగ్గిపోవడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో బ్రేక్‌ ఈవెన్‌ కూడా కాలేదనే ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం కరోనాకి గురై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న పవన్‌ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తన 27వ సినిమా `హరిహర వీరమల్లు` చేస్తున్నాడు. దీంతోపాటు మలయాళ సూపర్‌ హిట్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది తనకు 29వ సినిమా. ఈ రెండు చిత్రాలు ఏకకాలంలో రూపొందుతున్నాయి.

ఆ తర్వాత పవన్‌.. తనకు `గబ్బర్‌ సింగ్‌`లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని అందించిన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తన 28వ చిత్రం చేయబోతున్నారు. ఇది ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాకి `ఇప్పుడే మొదలైంది` అనే టైటిల్‌ వినిపిస్తుంది. అలాగే కథకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. `ఠాగూర్‌` తరహాలో పొలిటికల్‌, కమర్షియల్‌ అంశాలు మేళవించిన కథ అని, ఇందులో పవన్‌ ప్రొఫేసర్‌గా కనిపిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతుంటే, ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ కథ అని, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది.
ఇది కాకుండా తాజాగా మరో కథ లీకేజ్‌ అంటూ మరో వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కమర్షియల్‌ అంశాలతోనే ఉంటుందట. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీసుకునే అంశంతో సినిమా సాగుతుందని కొత్తగా వైరల్‌ అవుతుంది. కథ పరంగా ఇది కాస్త ఓల్డ్ ఫార్మాటే అయినా, దీనికి లేటెస్ట్ హంగులు అద్దబోతున్నారని, సందేశాత్మకంగా మలచబోతున్నారని తెలుస్తుంది.
ఇక్కడే ఫ్యాన్స్ కి గూస్‌బమ్స్ తెప్పించే అంశం చక్కర్లు కొడుతుంది.ఇందులో పవన్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. పవన్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. ఫస్ట్ టైమ్‌ ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్‌. దీంతో ఇప్పుడీ వార్త పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ ఇదే నిజమై తెరపైకి వస్తే ఇక పవన్‌ అభిమానులను ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Latest Videos

click me!