
పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాని కొన్ని చోట్ల తీసేసి.. బేబి సినిమాని వేయటం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. అయితే అందుకు కారణం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ .. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి. అలాగే ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్నా...సోమవారం వచ్చేసరికి పూర్తిగా డ్రాప్ అయ్యిపోయింది. నాలుగోరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ₹2.3 Cr షేర్ మాత్రమే వచ్చింది. సినిమా నాలుగు రోజుల్లో 60 కోట్లు గ్రాస్ దాకావచ్చిందని , మరో 75 కోట్లు గ్రాస్ వస్తే కానీ యావరేజ్ అవ్వదు అంటున్నారు.
సినిమా సక్సెస్ టాక్ ను అందుకోవడంతో మేకర్స్ ‘బ్రో - విజయ్ యాత్ర’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక ఆగస్టు 1న యాత్ర సాగనుంది. విజయవాడలోని కనకదుర్గ టెంపుల్ లో 9 గంటలకు ప్రారంభమై.. 12 గంటలకు తెనాలిలోని సంగమేశ్వర థియేటర్, 1:30కి గుంటూరులోని సర్వస్తి థియేటర్, 4 :30కి విజయవాడలోని జైరామ్ థియేటర్, 6 గంటలకు పీవీపీ మాల్ ను సందర్శించనున్నారు. అభిమానులు ఈ యాత్రను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా వారియర్, కేతికా శర్మ హీరోయిన్లు గా అలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
సినిమాకు ఊపు తేవటానికి మేకర్స్ ‘బ్రో - విజయ్ యాత్ర’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక ఆగస్టు 1న యాత్ర సాగనుంది. విజయవాడలోని కనకదుర్గ టెంపుల్ లో 9 గంటలకు ప్రారంభమై.. 12 గంటలకు తెనాలిలోని సంగమేశ్వర థియేటర్, 1:30కి గుంటూరులోని సర్వస్తి థియేటర్, 4 :30కి విజయవాడలోని జైరామ్ థియేటర్, 6 గంటలకు పీవీపీ మాల్ ను సందర్శించనున్నారు. అభిమానులు ఈ యాత్రను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా వారియర్, కేతికా శర్మ హీరోయిన్లు గా అలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
ఇదిలా ఉంటే బ్రో సినిమా ఆడుతున్న థియేటర్స్ లో కొన్నిటిని తీసేసి ‘బేబీ ’కి కేటాయించటం గమనార్హం. అందుకు కారణం...బేబి ని తీసేసి బ్రో కు ఇవ్వటమే అంటున్నారు. సాధారణంగా ఒక సినిమా కలెక్షన్స్ కు బ్రేక్ లేకుండా రన్ అవుతుంటే, థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లలో సినిమాను ఎక్కువ రోజులు కొనసాగించడానికే ఇష్టపడతారు. అయితే, 'బేబీ' మూవీ టీమ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది.
మెగా ఫ్యామిలీపై వారికి ఉన్న ఇష్టం కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. బేబీ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN మెగా ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్. అందుకే వారు శుక్రవారం విడుదలైన ‘బ్రో’ మూవీకి మద్దతుగా.. ‘బేబీ’ షోస్‌ను ప్రదర్శిస్తున్న థియేటర్లను ‘బ్రో’కు ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి.
బ్రో రిలీజ్ కు ముందు 'బేబీ' మూవీ ఎక్కువ థియేటర్లలోనే రన్ అవుతోంది. అయితే ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న 'బ్రో' కోసం 'బేబీ' మేకర్స్.. కొన్ని థియేటర్స్ ను వదిలేసుకున్నారు. వారికి మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానంతోనే ఇలా చేశారని వినపడింది. తమ సినిమా మరింత సక్సెస్ ను అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందరికంటే తమ సినిమానే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలని, ఎక్కువ రోజులు ఆడాలని ఆశిస్తూంటారు. కానీ సాయి రాజేష్, SKN మాత్రం తమ అభిమానాన్ని ఇలా చాటారని చెప్పుకున్నారు.
ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటించింది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. రెండో వారం కూడా ఈ మూవీ అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది. మూడో వారంలో ఎంట్రీ ఇచ్చిన రోజు నాడు ‘బ్రో’ రిలీజ్ అయినా బాగానే కలెక్ట్ చేసింది.
బేబీ (Baby) మూవీకి రూ. 5.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 16 రోజులు పూర్తయ్యేసరికి రూ.37.54 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.31.34(కరెక్టెడ్) కోట్ల భారీ లాభాలను అందించింది.
‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.54.76 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.43.74 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా ఇదే రేంజ్లో పెర్ఫార్మ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటేనే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అలాంటిది మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా అంటే థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ప్రస్తుతం ‘బ్రో’ సినిమాకు అలాంటి క్రేజే ఉంది. ఒకవైపు బయట వర్షం పడుతున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు తగ్గ లేదు. థియేటర్లకు క్యూ కట్టారు. అయితే సినిమా సోషల్ మెసేజ్ తో ఉండటం, పవన్ కళ్యాణ్ పాత్ర అనుకున్న స్దాయిలో అలరించకపోవటం అడ్డంకిగా మారాయి.అయినప్పటికీ వింటేజ్ పవన్ ని చూసి అభిమానులు మురిసిపోయారు.