అప్పుడు `బంగారం` ఇప్పుడు ఆచార్య.. `పోకిరి` సెంటిమెంట్‌ `సర్కారు వారి పాట`కి రిపీటైతే మహేష్‌ ఫ్యాన్స్ కి పండగే

Published : Apr 30, 2022, 09:03 PM IST

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు మహేష్‌, మెగా హీరోల విషయంలో ఆ సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. అప్పుడు `బంగారం`, `పోకిరి`.. ఇప్పుడు `ఆచార్య`, `సర్కారు వారి పాట`కి లింక్‌ పెడుతున్నారు. 

PREV
15
అప్పుడు `బంగారం` ఇప్పుడు ఆచార్య.. `పోకిరి` సెంటిమెంట్‌ `సర్కారు వారి పాట`కి రిపీటైతే మహేష్‌ ఫ్యాన్స్ కి పండగే

మహేష్‌బాబు(Maheshbabu) కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో `పోకిరి`(Pokiri) ముందు వరుసలో ఉంటుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌కి కలెక్షన్ల రుచేంటో చూపించింది. సరికొత్త ట్విస్ట్ తో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చేసిన మ్యాజిక్‌ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో ఇలియానా అందాలు, మహేష్‌ మ్యానరిజం హైలైట్‌గా నిలిచాయి. ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. 

25

సరిగ్గా ఐదు రోజుల గ్యాప్‌తో మెగా కాంపౌండ్‌ నుంచి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) నటించిన `బంగారం`(Bangaram Movie)చిత్రం విడుదలైంది. తమిళ దర్శకుడు ధరణి తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రమిది. ఇందులో మీరా చోప్రా కథానాయికగా నటించింది. ఈ చిత్రం 2006, మే 3న విడుదలై ఫ్లాప్‌ అయ్యింది. దీంతో మహేష్‌ నటించిన `పోకిరి` చిత్రానికి అడ్డే లేదు. దీంతో తిరుగులేని విధంగా ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. 
 

35

అయితే ఇదే సీన్‌ మళ్లీ రిపీట్‌ కాబోతుందంటున్నారు మహేష్‌ (Mahesh) ఫ్యాన్స్. అందుకు చిరంజీవి(Chiranjeevi) నటించిన `ఆచార్య`(Acharya)కి, మహేష్‌ నటించిన `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata) చిత్రానికి లింక్‌ పెడుతున్నారు. ఈ రెండు చిత్రాల మధ్య 13 రోజులు గ్యాప్‌ ఉంది. కానీ రెండింటికి పోలికలు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆచార్య` శుక్రవారం(ఏప్రిల్‌ 29)ని విడుదలై ఫ్లాప్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఓపెనింగ్స్ రూపంలో ఈ చిత్రం రూ.53కోట్ల గ్రాస్‌ని వరల్డ్ వైడ్‌గా సాధించడం విశేషం. 

45

మహేష్‌బాబు నటించిన `సర్కారు వారి పాట` మే 12న విడుదల కాబోతుంది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ కథానాయికగా నటించింది. బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మరో రెండు రోజుల్లో ట్రైలర్‌ రాబోతుంది. మహేష్‌ నుంచి ఈ సారి కూడా హిట్‌ పక్కా అంటున్నారు ఆయన అభిమానులు. 
 

55

అయితే ఈ వారం చిరంజీవి నటించిన `ఆచార్య` పరాజయం చెందడంతో అది మహేష్‌కి కలిసొస్తుందంటున్నారు. ఇక `సర్కారు వారి పాట`కి తిరుగేలేదని చెబుతున్నారు ఫ్యాన్స్. సరిగ్గా 16ఏళ్ల క్రితం జరిగినదే ఇప్పుడు జరుగుతుందని చెబుతున్నారు. కాకపోతే సినిమాల విడుదలలో ముందు వెనకా మాత్రమే అని, అప్పుడు మెగా హీరోతో పోటీలో మహేష్‌ విన్నర్‌గా నిలిచి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడని, ఇప్పుడు కూడా మెగా హీరోతో పోటీలోనూ మహేష్‌ విన్నర్‌ అవుతాడనడంలో సందేహం లేదంటున్నారు. మరి ఆ సెంటిమెంట్‌, ఆ మ్యాజిక్‌ ఇప్పుడు రిపీట్‌ అవుతుందా? అనేది చూడాలి. అదే జరిగితే మహేష్‌ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories