పవన్ కళ్యాణ్ నుంచి ప్రకాశ్ రాజ్ వరకు.. రెండోసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌత్ సెలబ్రిటీలు

Published : Feb 03, 2026, 09:32 AM IST

పవన్ కళ్యాణ్, నాగచైతన్య, ప్రకాశ్ రాజ్ తో పాటు .. చాలామంది సౌత్ ఇండియాన్ స్టార్స్ రెండో సారి ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ లిస్ట్ లో ఇంకా ఎంత మంది స్టార్స్ ఉన్నారు…? వారు చేసుకున్న సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? 

PREV
16
నాగచైతన్య - సమంత

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య రెండు సార్లు ప్రేమలో పడ్డాడు. ముందుగా హీరోయిన్ సమంతతో 7 ఏళ్లు ప్రేమలో ఉన్న చైతూ.. పెళ్లి చేసుకున్న మూడేళ్లకే విడాకులు తీసుకున్నాడు. ఆతరువాత మరో హీరోయిన్ శోభితతో రెండో సారి ప్రేమలో పడ్డాడు. వీరు పెళ్లి చేసుకుని హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

మరో వైపు సమంత కూడా రెండో సారి ప్రేమలో పడింది. నాగచైతన్యతో విడాకుల తరువాత దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు స్టార్స్ తమ జీవితంలో రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 

26
పవన్ కళ్యాణ్

సౌత్ స్టార్ హీరో, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ రెండుసార్లు విడాకులు తీసుకున్న తర్వాత, రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాను పెళ్లి చేసుకున్నారు. పవన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్ళాడాడు. ఆమెతో విడాకుల తరువాత అన్నాలెజ్నెవాను ప్రేమించి పెళ్లాడాడు.

36
ప్రకాష్ రాజ్

నటుడు ప్రకాష్ రాజ్ ముందుగా లలిత కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడాకులు తరువాత.. 2010లో పోనీ వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కొడుకు ఉన్నాడు. మొదటి పెళ్లి ద్వారా ప్రకాష్ రాజ్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

46
ప్రభుదేవా

మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ప్రభుదేవ డాక్టర్ హిమానీ సింగ్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ప్రభుదేవ గతంలో నయనతారను కూడా ప్రేమించారు. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం చాలా పెద్దవివాదం అవ్వడంతో వెనక్కి తగ్గారు.

56
రాధికా శరత్‌కుమార్

రాధిక రెండుసార్లు విడాకులు తీసుకున్న తర్వాత, 2001లో నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు ఈ జంట దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన, అన్యోన్యమైన దంపతులుగా ఉన్నారు. శరత్‌కుమార్‌కు కూడా ఇది రెండో పెళ్లే.

66
లక్ష్మీ

ప్రముఖ నటి లక్ష్మి మూడు పెళ్లిల్లు చేసుకున్నారు. మొదట రెండు విడాకుల తర్వాత నటుడు శివచంద్రన్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నారు లక్ష్మి. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదే స్టార్ డమ్ ను కంటీన్యూ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories