పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ మీటింగ్ ని ఎందుకు దాచిపెడుతున్నారు.. అసలేం జరిగింది ?

Published : Apr 15, 2025, 02:39 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని మీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తని బన్నీ సన్నిహిత వర్గాలు కంఫర్మ్ చేస్తున్నాయి. అయితే అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, అల్లు ఫ్యామిలీ నుంచి కానీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు.

PREV
15
పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ మీటింగ్ ని ఎందుకు దాచిపెడుతున్నారు.. అసలేం జరిగింది ?
Allu Arjun, Pawan Kalyan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని మీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తని బన్నీ సన్నిహిత వర్గాలు కంఫర్మ్ చేస్తున్నాయి. అయితే అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, అల్లు ఫ్యామిలీ నుంచి కానీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు. బన్నీ, పవన్ భేటీని చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మీట్ అయితే దానిని ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి, అదేమీ తప్పు కాదు కదా అనే ప్రశ్న వినిపిస్తోంది. 

25
Pawan Kalyan son

అయినప్పటికీ ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అనేది ఫ్యాన్స్ కి అర్థం కాని విషయం. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలతో మార్క్ శంకర్ కోలుకున్నాడు. దీనితో మార్క్ శంకర్ ని చూసేందుకు అల్లు అర్జున్ పవన్ ఇంటికి వెళ్లారట. దాదాపు గంట సమయం అల్లు అర్జున్ పవన్ కుటుంబ సభ్యులతో గడిపి వచ్చినట్లు తెలుస్తోంది. 

35
Allu Arjun

పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ మీట్ కావడం సాధారణంగా అయితే పెద్ద చర్చనీయాంశం కాదు. కానీ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న పరిణామాల వల్ల వీళ్లిద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అనే కామెంట్ చేసినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ బన్నీపై గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల కారణంగా మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య విభేదాలు మొదలైనట్లు కూడా వార్తలు వచ్చాయి. 

45
pawan kalyan, allu arjun

గత సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లి వైసిపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి బన్నీపై మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బంధం అంత బలంగా లేదని నామమాత్రంగా ఉందని అంటున్నారు. 

55

పుష్ప 2 చిత్రం రిలీజ్ అయినప్పుడు స్మగ్లర్లని హీరోలుగా చూపిస్తున్నారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణం అయ్యాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఇలా ఏదో విభేదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ని మీట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు పెద్ద ఎత్తున ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories