Bheemla Nayak v/s Pushpa: పవర్‌స్టార్‌ని గట్టిగా ఇరికించిన వర్మ.. బన్నీ, పవన్‌ ఫ్యాన్స్ మధ్య కొత్త చిచ్చు..

Published : Feb 17, 2022, 01:59 PM IST

వివాదాస్పదన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. పవన్‌ కళ్యాణ్‌కి ఛాలెంజ్‌ విసిరాడు. సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటున్న పవన్‌కి, బన్నీ ఫ్యాన్స్ కి మధ్య చిచ్చుపెడుతున్నాడు. పవన్‌కి అసలైన ప్రత్యర్థి బన్నీని చేశాడు. ఒక్క విషయంలో మాత్రం గట్టిగా ఇరికించాడు.   

PREV
16
Bheemla Nayak v/s Pushpa: పవర్‌స్టార్‌ని గట్టిగా ఇరికించిన వర్మ.. బన్నీ, పవన్‌ ఫ్యాన్స్ మధ్య కొత్త చిచ్చు..

రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma).. పవన్‌(Pawan)పై విమర్శలు చేస్తూ తను హైలైట్‌ అవుతుంటాడు. వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ విరుచుకుపడ్డ వర్మ.. కొంత గ్యాప్‌ ఇచ్చి ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నాడు.  ఈ సారి మెగా ఫ్యామిలీ హీరోల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే పవర్‌స్టార్‌, ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు. పవన్‌కి ఇప్పుడు అసలైన ప్రత్యర్థి అల్లు అర్జునే అని విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. 

26

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటించిన `పుష్ప`(Pushpa) చిత్రం ఊహించని విధంగా బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించింది. ఎలాంటి ప్రమోషన్‌ లేకుండానే గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం హిందీలో దాదాపు 90కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఇది అటు బాలీవుడ్‌ వర్గాలకు, ఇటు టాలీవుడ్‌కి షాకింగ్‌ విషయమే. Pushpa టీమ్‌ మాత్రం ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నారు. హిందీ కలెక్షన్లు మొత్తం వారికి భోనస్‌ అనే చెప్పాలి.
 

36

అయితే ఇప్పుడు హిందీలో విడుదలయ్యే తెలుగు సినిమాలకు `పుష్ప`నే టార్గెట్‌గా మారుతుండటం విశేషం. ఇదే విషయాన్ని వర్మ తెరపైకి తీసుకొచ్చారు. త్వరలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన `భీమ్లా నాయక్‌` విడుదలకాబోతుంది. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్‌ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే యూనిట్‌ ప్రకటించింది. అయితే సినిమా బాగుంటే తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కి తిరుగులేదు. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ సినిమా పాజిటివ్‌ టాక్‌ వస్తే `అఖండ` మాదిరిగా దుమ్మురేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

46

కానీ ఇప్పుడు `భీమ్లా నాయక్‌`కి అసలు సవాల్‌ బాలీవుడ్‌ విషయంలోనే. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్‌ కాబోతుంది.  ఫస్ట్ టైమ్‌ పవన్‌ సినిమా నార్త్ లో విడుదల అవుతుందనే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా, సస్పెన్స్ గా మారింది. బన్నీ నటించిన `పుష్ప` చిత్రం హిందీలో ఘన విజయం సాధించి భారీ కలెక్షన్లని సాధించింది. దీంతో `భీమ్లా నాయక్‌` విషయంలోనూ ఆ అంచనాలు నెలకొన్నాయి. `పుష్ప`ని `భీమ్లా నాయక్‌` కలెక్షన్ల విషయంలో కొడుతుందా? అనేది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

56

బన్నీ కంటే భారీ ఇమేజ్‌, క్రేజ్‌ ఉన్నపవన్‌ హిందీలో అల్లు అర్జున్‌ని బీట్‌ చేస్తాడా? అనే ప్రశ్న రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ రూపంలో సంధించాడు. ఇద్దరు మెగా హీరోల మధ్య ఇది తీవ్ర పోటీగా మారుతుందని అంటున్నారు క్రిటిక్స్. దీని వల్ల పవన్‌, బన్నీ ఫ్యాన్స్ మధ్య వర్మ సరికొత్త చిచ్చు రాజేసినట్టే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీంతో పవన్‌కిది చాలా ఛాలెంజింగ్‌ విషయంగా మారింది. కానీ పవన్‌ ఇలాంటి విషయాలను పట్టించుకోరు. అసలాయన కౌంట్‌లోకి తీసుకోరు. కానీ ఫ్యాన్స్ విషయంలోనే ఇది పెద్ద రచ్చగా మారబోతుంది. 

66

ఇప్పటికే Pawan, Allu Arjun ఫ్యాన్స్ కి పడటం లేదు. అదే సమయంలో అల్లు అర్జున్‌ సినిమా ఫంక్షన్లలో పవన్‌ ఫ్యాన్స్ హంగామా చేయడంతో అసంతృప్తి చెందిన బన్నీ పరోక్షంగా ఇప్పటికే పలుమార్లు సెటైర్లు వేశాడు. దీంతో ఓ రకంగా బన్నీ,పవన్‌ అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో అడపాదడపా రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని మరింతగా రెట్టింపు చేస్తున్నారు వర్మ. హిందీలో `పుష్ప` కలెక్షన్లని `భీమ్లా నాయక్‌` బీట్‌ చేస్తాడా? అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ఇప్పుడిది టాలీవుడ్‌లో పెద్ద హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. కానీ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు బాలీవుడ్‌లో నెంబర్‌(కలెక్షన్ల) గేమ్‌ స్థాయికి వెళ్లడం తెలుగు వారికి గర్వపడే విషయంగానే చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories