హీరోయిన్ ఇంట్లో పనోడి అరాచకం, పర్శనల్ ఫొటోలతో బ్లాక్ మెయిల్, అరెస్ట్

First Published Dec 8, 2022, 1:42 PM IST

తన ఇంట్లోకి రాత్రి పూట ఎవరెవరో వచ్చేవాళ్ళు. అది నేను చూశానని, నన్ను టార్చర్ పెట్టింది. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో అది నా మీదకి తోసేసి నన్ను మానసికంగా వేధిస్తుంది. 

parvathi nair


పనివాళ్లను ,అసెస్టెంట్ లను పనిలో పెట్టుకునేటప్పుడు ఆచి,తూచి ముందుకు వెళ్తూంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురౌతూంటాయి. అలాంటి ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఇరుక్కున్నానంటోంది హీరోయిన్ పార్వతి నాయిర్.  పనిలోంచి తీసేసిన పనివాడు మీడియాకు ఎక్కాడు. తనపై లైంగిక వేధింపుల కేసు పెడ‌తాన‌ని బెదిరిస్తుందని అన్నారు. ఆమె తన ఇంట్లో దొంగతనం చేసి, నిలదీసినందుకు ఇలా రివర్స్ గేర్ లో మాట్లాడుతున్నాడంటోంది. ఈ క్రమంలో ఆ పనికుర్రాడుని అరెస్ట్ చేసారు పోలీస్ లు.  అసలు ఏమి జరిగింది.. తమిళ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు...

Parvathi Nair


 మ‌ల‌యాళ హీరోయిన్ పార్వ‌తీ నాయ‌ర్ (Parvathi Nair) చెన్నై (Chennai)లోని నుంగంబాకంలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో రూ.9 ల‌క్ష‌లు విలువ చేసే రెండు వాచీలు, రూ.1.5 ల‌క్ష‌లు విలువ చేసే ఐ ఫోన్‌, రూ. 2 ల‌క్ష‌లు విలువైన ల్యాప్ టాప్ చోరీ అయ్యింది. త‌న ఇంట్లో ప‌ని చేసే సుభాష్‌పై అనుమానంతో పార్వతి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వారు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

parvathi nair


అయితే సుభాష్.. పార్వతీ నాయ‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈమె ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా పార్వతి నాయర్ ఇంట్లో పనిచేసే సుభాష్ ని అదుపులోకి తీసుకున్నారు. సుభాష్ ఇంటికి కూడా వెళ్లి చెక్ చేశారు. అయితే ఈ దర్యాప్తులో సుభాష్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.

parvathi nair


త‌న‌పై లైంగిక ఆరోప‌ణ‌ల కేసు పెడ‌తాన‌ని బెదిరించిన‌ట్లు, ఆమె ఇంట్లో జ‌రిగిన చోరీకి త‌న‌ను మాన‌సికంగా వేధిస్తుంద‌ని సుభాష్ పోలీసుల‌కు చెప్పారు. త‌నను రెండు సార్లు కొట్టట‌మే కాకుండా ముఖంపై ఉమ్మింద‌ని కూడా అన్నారు. కావాల‌నే దొంగ‌త‌నం కేసులో ఇరికించింద‌ని కూడా సుభాష్ చెప్ప‌టం ఇండ‌స్ట్రీలో టాపిక్‌గా మారింది.

parvathi nair


 సుభాష్ ని పోలీసులు విచారించగా.. ”పార్వతి నాయర్ నాపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. తన ఇంట్లోకి రాత్రి పూట ఎవరెవరో వచ్చేవాళ్ళు. అది నేను చూశానని, నన్ను టార్చర్ పెట్టింది. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో అది నా మీదకి తోసేసి నన్ను మానసికంగా వేధిస్తుంది. గతంలో నన్ను కొట్టింది, నా ముఖం పై ఉమ్మి వేసింది. నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించింది” అని తెలిపాడు.

Parvathi Nair

ఎవ‌రో కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పార్వ‌తీ నాయర్ ఇంట్లోకి వ‌చ్చి ఆమెను క‌లుసుకోవ‌టం తాను చూశాన‌ని అప్ప‌టి నుంచి ఆమె అలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని సుభాష్ అంటున్నాడు. అవన్ని బయిటకు రాకుండా ఉండేందుకు తన నోరు నొక్కేస్తుందని ఆరోపిస్తున్నాడు.

Parvathi nair

parvathi nair


అయితే పార్వతి నాయర్ ఆరోపణ ఏమిటంటే...తన పర్శనల్ ఫొటోల కలెక్షన్స్ తన ఫోన్ నుంచి దొంగతనం చేసి వాటిని మిస్ యూజ్ చేస్తున్నాడని అంటోంది. తన ఫోన్ ని అతను తన ఇంటినుంచి దొంగతనం చేసాడని అంటోంది. ఇదేంటిదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నట్లు చెప్పింది.

Parvathi nair


సుభాష్ మీడియాతో మాట్లాడుతూ... “ఆమె నన్ను రెండు సార్లు కొట్టింది. మొహంపై ఉమ్మేసింది . ఆమెకు చెందిన వాళ్లు సైతం నాపై ఎటాక్ చేసారు. నేను మొదట నుంగం బాకం పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చాను. వాళ్లు తమ పరిధిలోకి రాదని కంప్లైంట్ తీసుకోలేదు. ఆ తర్వాత తేనాం పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడ కంప్లైంట్ ఇచ్చి రెండు రోజులు అయినా ఎవరు ఆమెపై యాక్షన్ తీసుకోలేదు. దాంతో నేను డైరక్ట్ గా పోలీస్ కమీషనర్ నే కలిసాను.  ” అని చెప్పుకొచ్చాడు.

Parvathi nair


అలాగే ...నన్ను ఓ నిర్మాత ఆమె ఇంట్లో ఉద్యోగంలో పెట్టాడు. అక్కడ ఏం జరుగుతోందో చెప్పమన్నాడు. నేను ఆమె ఇనిస్ట్రగ్రమ్ ఫొటో షూట్ పర్యవేక్షిస్తూండేవాడని. అయితే రాత్రిపూట ఆమె ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వస్తూండేవారు. వాళ్ళను నేను చూస్తున్నానని ఆమె నెర్వస్ గా ఫీలైంది. కానీ నేను డబ్బున్న వాళ్ళు అని పట్టించుకోలేదు, కానీ ఆమె నన్ను ఇరికించేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

Parvathi nair


పార్వతి మాట్లాడతూ అతను చెప్పేవన్నీ అబద్దాలే.  నా పర్శనల్ ఫొటోలు దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంతేకాదు నేను పెట్టిన పోలీస్ కేసు వెనక్కి తీసుకోకపోతే ఆత్మహత్యా చేసుకుంటానని బెదిరించాడు.  అయితే అలా బెదిరించేవాళ్ళు నిజంగా సూసైడ్ చేసుకోరని తెలిసి రిలీఫ్ అయ్యాను. అంటూ చెప్పుకొచ్చింది.

Parvathi nair

పార్వ‌తి మ‌ల‌యాళ, త‌మిళ చిత్రాల‌తో పాటు క‌న్న‌డ చిత్రాల్లో హీరోయిన్‌గా, కీల‌క పాత్ర‌ధారిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబర్‌లో చెన్నైలోని నుంగంబాక్కంలోని తన ఇంట్లో దాదాపు రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీకి గురైందని, తన ఇంట్లో పనిచేసే సుభాష్ పై అనుమానముందని పార్వతి పోలీసులకి ఫిర్యాదు చేసిన నాటి నుంచి ఈ వివాదం మొదలైంది.
 

click me!