కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన వివాదాలే అందుకు కారణం. మరో వైపు శివాజీ కెరీర్ లో కూడా మునుపటి జోష్ వచ్చేసింది.