Intinti Gruhalakshmi: కొడుకు, కోడళ్ళని మనవల్ల కోరిక కోరిన తులసి.. సామ్రాట్ ని సహాయం కోరిన పరంధామయ్య!

First Published Oct 13, 2022, 10:39 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జరిగిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. తులసి తన గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్, అమ్మని ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను తాతయ్య అమ్మ దగ్గరికి వెళ్లడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు అని అంటాడు. దానికి పరంధామయ్య,మీ అమ్మ నా మీద, మీ నాన్న మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది. దగ్గర వాళ్ళే మోసం చేస్తూ ఉంటే ఎలా తట్టుకోగలుగుతారు ఇది చూస్తూ నేను ఊరుకోలేను. నేను చేయాల్సింది నేను చేస్తానుఎవరు ఏమనుకున్నా సరే అని పరంధామయ్య అంటాడు.
 

 ఆ తర్వాత రోజు ఉదయం హాల్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉండగా తులసి అనసూయ దగ్గరకు వచ్చి మందులు వేసుకోమని చెప్తుంది. అప్పుడు అనసూయ నేను తర్వాత వేసుకుంటాను అని అనగా, మళ్ళీ మర్చిపోతారు అత్తయ్య అని మందులు ఇస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. అదే సమయంలో ఇద్దరు ఆడవాళ్లు అనసూయ దగ్గరికి వచ్చి, సాయంత్రం మా కోడలు సీమంతం. పిలుపులు కి వచ్చాము పెళ్లయిన నాలుగు నెలలకే శుభవార్త చెప్పింది మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మరి మీ సంగతి ఏంటి మీ పిల్లలకి పెళ్లి అయ్యి చాలా రోజులైంది కదా అని చెప్పి, సరే అయితే అందరూ తప్పకుండా రావాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
 

 దాని తర్వాత అనసూయ, వాళ్ళు ఏమన్నారు విన్నారు కదా అని అంటుం.ది దానికి తులసి, అవును నేను కూడా మీకు ఈ విషయం గురించి చెబుదామనుకున్నాను కానీ సమయం రాలేదు అని అంటుంది. అప్పుడు పరంధామయ్య, మీరు అడిగితే ఇబ్బంది పడతారని అడగలేదు కానీ అందరి కోరిక అదే అని అంటాడు. దానికి తులసి, ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనే ఉద్దేశాలు ఉన్నాయా లేకపోతే మీ ఉద్యోగాల వల్ల పిల్లలను చూసుకోలేరు అని బాధ పడితే దానికి నేను ఉన్నాను అని అంటుంది. అప్పుడు శృతి మనసులో,ఇదే మంచి సమయం జరిగిన విషయం చెప్పేదాము అని అనుకునే లోగా ప్రేమ్, అలా ఏమీ లేదమ్మా సమయం సందర్భం ఉండాలి కదా దేనికైనా అని అంటాడు. 
 

అభి కూడా అవునమ్మా దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా అని అంటాడు. దానికి తులసి, అయితే నేను దేవుడిని గట్టిగా ప్రార్థిస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో తులసి బ్యాగ్ వేసుకొని బయలుదేరుతుండుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అనసూయ అడుగుతుంది. సామ్రాట్ గారు ఆఫీస్ కి వెళ్తున్నాను అని అనగా అనసూయ కోప్పడి, నువ్వు ఇంకా మారవా ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు ఇలా మొండిపట్టు పడుతున్నావు అని అడగగా, ఇదే నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను అత్తయ్య గారు. నేను వెళ్తుంది సామ్రాట్ గారి దగ్గరకు కాదు సామ్రాట్ గారి ఆఫీస్ కి నా మ్యూజిక్ స్కూల్ విషయం మీద అని వెళ్తున్నాను.
 

నేను ముందే చెప్పాను కదా అందరి ముందు సామ్రాట్ గారికి నాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంతకుమించి ఏదీ లేదని. అప్పుడు వాళ్లు కూడా చప్పట్లు కొట్టారు కదా ఇప్పుడు ఆఫీసుకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే నేను తప్పు చేశాను అని వాళ్ళు నిందిస్తారు అని అంటుంది. అప్పుడు అనసూయ, నువ్వు మా పాత తులసివి కాదు మా పాత తులసి అయితే కుటుంబానికి ముందు ప్రాముఖ్యత ఇస్తుంది నువ్వు అలా లేవు అని అంటుంది. దానికి తులసి, నేను ఇప్పటికీ కుటుంబానికే ప్రాముఖ్యత ఇస్తాను అత్తయ్య కానీ నా జీవితం ఇంట్లోనే ఆగిపోకూడదు అని నేను కోరుకుంటున్నాను అని తులసి అంటుంది.
 

దానికి అనసూయ, మరి నా జీవితం కూడా ఇంట్లోనే అయిపోయింది కదా అని అనగా, మీది వేరే అత్తయ్య మీకు బంగారం లాంటి మావయ్య గారు ఉన్నారు నాకు మాత్రం మధ్యలో వదిలేసిన మీ కొడుకు దక్కారు నేను అలాగే మధ్యలో ఉండిపోకూడదు నన్ను వెళ్ళనివ్వండి దయచేసి అని చెప్పి బయలుదేరుతుంది. ఇంకేమీ అనలేక అనసూయ కూడా ఊరుకుంటుంది. ఆ తర్వాత సీన్లో పరంధామయ్య సామ్రాట్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు పరంధామయ్య, మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అనగా, నాకు తులసిగారన్నా వాళ్ళ కుటుంబం అన్నా గౌరవం ఎక్కువ వాళ్ళు ఏం అడిగినా కాదనను అని అంటాడు. 
 

పక్కనే ఉన్న సామ్రాట్ వాల్ల బాబాయ్ కూడ,మా వాడు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పడు అని అనగా, పరంధామయ్య సామ్రాట్ కి పేపర్లు చూపిస్తూ ఏదో విషయం చెప్తాడు. దానికిదానికి సామ్రాట్,మరి ఈ శుభవార్త ఇంట్లో చెప్పారా అని అనగా, లేదు దీన్నే ఇంకొక విధంగా చెప్పాలనుకుంటున్నాను ఈ లోపల నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. దానికి సామ్రాట్ సరే తప్పకుండా చేద్దాము అని అంటాడు. ఆ తర్వాత సీన్లో తులసి ఆఫీస్ కి వస్తుంది. అదే సమయంలో లాస్య నందు దగ్గర ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ నా మీద మీకు నమ్మకం లేదా జనరల్ మేనేజర్ గారు అని లాస్య అనగా, అలా కాదు అని నందు అంటాడు.
 

నమ్మకం ఉండబట్టే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు అని లాస్య అంటుంది. పర్సనల్ విషయాలు ఆఫీసులో మాట్లాడొద్దు లాస్య ఇంట్లో నువ్వు నాకు బాస్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేనే నీ బాస్ ని అని అంటాడు. అదే సమయంలో తులసి తన క్యాబిన్లో మ్యూజిక్ స్కూల్ ఫైల్స్ కోసం వెతుకుతూ ఉండగా అవి దొరకవు. ఫైల్స్ ఏవి అని తులసి అడగగా వాటిని లాస్య  మేడం తీసుకున్నారు. ఆ ఫైల్స్ గురించి అన్ని లాస్య మేడమే చూసుకుంటారు అట. మిమ్మల్ని జోక్యం చేసుకోవద్దు అని చెప్పారు అంతా అయిపోయిన తర్వాత చూపించడానికి మిమ్మల్ని పిలుస్తారట అని అనగా తులసి కోప్పడుతుంది. ఆవేశంతో వెంటనే లాస్య దగ్గరకు వస్తుంది తులసి.. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!