Alia Bhatt AI Images: అలియా భట్‌ ఫేక్ ఫోటోలతో పాకిస్థాన్ లో దారుణం, స్టార్స్ కి తలనొప్పిగా AI టెక్నాలజీ..

Published : Apr 22, 2026, 09:26 PM IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. వారి అనుమతి లేకుండా మార్ఫింగ్ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా, అలియా భట్ ఫోటోలను ఓ పాకిస్థానీ బ్రాండ్ ఏం చేసిందంటే? 

PREV
14
సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారిన AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. వారి అనుమతి లేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి వాడుకుంటున్నారు. తాజాగా, బాలీవుడ్  హీరోయిన్  అలియా భట్ ఫోటోలను ఓ పాకిస్థానీ బ్రాండ్ తమ బట్టల ప్రమోషన్ కోసం వాడటం వివాదాన్ని రేపింది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో మళ్ళీ చర్చ మొదలైంది.

24
అలియా భట్ ఫోటోలను మార్ఫింగ్ చేసి..

పాకిస్థాన్‌కు చెందిన 'వజయేశా అఫీషియల్' అనే బట్టల బ్రాండ్ ఈ పని చేసింది. అలియా భట్ తమ బట్టల కలెక్షన్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ఏఐ టెక్నాలజీతో ఫోటోలను మార్ఫింగ్ చేసింది. ఆమె ధరించిన డ్రెస్‌ను మార్చేసి, తమ డిజైన్‌ను అతికించారు. ఇది గమనించిన అభిమానులు, ఎలాంటి అనుమతి లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ బ్రాండ్‌పై మండిపడ్డారు.

34
అలియా భట్ అభిమానులు ఏమంటున్నారంటే?

అలియా భట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆ బ్రాండ్‌ను ఏకిపారేశారు. ఇది ఫేక్ ప్రమోషన్ అని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అయినా ఆ బ్రాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ వివాదం వైరల్ అవ్వడాన్ని వాళ్లు ఇంకా ప్రోత్సహించడం గమనార్హం. 

44
అలియా భట్ సినిమాల విషయానికొస్తే..?
ఇక అలియా భట్ సినిమాల విషయానికొస్తే, శివ్ రావిల్ దర్శకత్వంలో 'ఆల్ఫా' అనే సినిమాతో ఆమె తిరిగి రానుంది. ఈ సినిమా YRF స్పై యూనివర్స్‌లో కీలకమైనది. దీంతో పాటు, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో కూడా నటించనుంది.
Read more Photos on
click me!

Recommended Stories