పాకిస్తాన్‌లో అల్లు అర్జున్‌ అభిమాని కోరిక నుంచి పుట్టిన `తండేల్‌`.. అసలేం జరిగిందంటే?

Published : Feb 08, 2025, 08:51 PM IST

నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్‌` సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పాకిస్తాన్‌లోని అల్లు అర్జున్‌ అభిమాని అయిన పోలీస్‌ దీనికి కారణమని తెలుస్తుంది.   

PREV
15
పాకిస్తాన్‌లో అల్లు అర్జున్‌ అభిమాని కోరిక నుంచి పుట్టిన `తండేల్‌`.. అసలేం జరిగిందంటే?
thandel movie, Naga Chaitanya, sai pallavi

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `తండేల్‌` మూవీ మంచి టాక్‌తో రన్‌ అవుతుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతుంది. తొలి రోజు నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టింది.

సుమారు రూ. 21కోట్ల గ్రాస్‌ రాబట్టిందని టీమ్‌ ప్రకటించింది. ఇది చైతూకి బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా చెప్పొచ్చు. అంతేకాదు మూవీ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

25
Thandel Movie Review

`తండేల్‌` సినిమా ఎలా పుట్టింది? ఎలా స్టార్ట్ అయ్యిందనేది లీక్‌ అయ్యింది. అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. పాకిస్తాన్‌లోని ఓ పోలీస్‌ దీనికి కారణమని టీమ్‌ చెబుతుంది. అతను అల్లు అర్జున్‌ అభిమాని అని, అతని వల్లే ఈ మూవీ పుట్టిందని టీమ్‌ చెబుతుంది.  మరి ఆ కథేంటో చూస్తే, ఈ సినిమా పాకిస్తాన్‌ జైల్లో చిక్కుకున్న మన జాలర్ల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన విషయం తెలిసిందే. 

35
allu arjun

అయితే నిజానికి పాకిస్తాన్ లో చిక్కుకుని కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలరులకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సాయం చేశాడట. అతడు అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ జాలరులు పాకిస్తాన్ జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో సాయపడుతూ వచ్చాడు ఆ కానిస్టేబుల్.

అయితే ఆ జాలరులు విడుదలవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక ఫేవర్ అడిగారు. అదేంటంటే మీ దేశంలోని ఐకాన్ సార్ అల్లు అర్జున్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఆయన అభిమానిని. నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని నాకు పంపించండి అని కోరారు. 

45
Thandel Movie Review

భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ జాలరులు కార్తీక్ అనే వ్యక్తికి జరిగిన విషయం అంతా చెప్పడంతో అతడు ఎట్టకేలకు ఈ జరిగిన కథ అంతటిని గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలోని బన్నీ వాసుకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం చెప్పడం జరిగింది. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందని జరిగిన కథను తెలుసుకున్న  బన్నీ వాసు ఈ కథపై ఆసక్తి కలిగి జరిగిన పూర్తి కథను తెలుసుకొని,

దీనిని అందరూ తెలుసుకునే విధంగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. అలా బన్నీ ఫ్యాన్ అయిన కరాచీ జైలులోని ఒక కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడంతో మొదలై చివరకు ఇప్పుడు జరిగిన ఆ కథ అంతా `తండేల్` గా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. సినిమాకి మంచి స్పందన రావడం మరో విశేషం. 
 

55
Thandel Movie Review

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్‌` మూవీకి చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌ నిర్మించారు. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా ఈ మూవీని రూపొందంచారు. ఇందులో చైతూ, సాయిపల్లవి రెచ్చిపోయి నటించారు. సినిమా కథ పరంగా, కథనం పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా, చైతూ, సాయిపల్లవి తమ నటనతో మ్యాజిక్‌ చేశారు. వారే సినిమాని మోశారు, నిలబెట్టారని చెప్పడంలో అతిశయోక్తి లేదు 

read more:నన్ను క్రిమినల్‌ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్‌మెంట్‌

also read: `స్పిరిట్‌` విషయంలో సందీప్‌ రెడ్డి వంగా కండీషన్‌, ప్రభాస్‌ అయినా సరే ఆ రూల్‌ పాటించాల్సిందేనా?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories