సవాల్‌ విసిరిన యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌కి చుక్కలు చూపించిన తెలుగోడు..

Published : Dec 30, 2020, 09:57 AM IST

వెస్ట్ ఇండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌.. తెలుగు క్రికెటర్‌, ఇండియన్‌ టాప్‌ వన్‌ స్పిన్నర్‌ ని స్టేడియం బయట కొడతానన్నాడు. మరి తెలుగోడు ఏం చేశాడు. స్టేడియంలో చూసుకున్నాడు. సిక్స్ లతో సిక్స్ లతో రెచ్చిపోయే గేల్‌ని పొగరు అణిచాడు.  వికెట్‌ తీసి అన్నీ మూసుకునేలా చేశాడు. అతనెవరో కాదు తెలుగు క్రికెటర్‌, బౌలర్‌ ప్రగ్యాన్‌ ఓజా. ఆయన తాజాగా సాయికుమార్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే `వాహ్‌.. మంచి కిక్క్ ఇచ్చే గేమ్‌షో`లో హారిక, గుత్తా జ్వాల, మధుశాలినిలతో కలిసి పాల్గొన్నారు. అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. 

PREV
111
సవాల్‌ విసిరిన యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌కి చుక్కలు చూపించిన తెలుగోడు..
ప్రగ్యాన్‌ ఓజా మాజీ టీమిండియా క్రికెట్‌ ప్లేయర్. ఐసీసీ నెంబర్‌ వన్ స్పిన్నర్‌. టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్నీ ఫార్మాట్‌లలో బెస్ట్ బౌలర్‌గా రాణించిన ప్రగ్యాన్‌ ఓజా ప్రస్తుతం ఐపీఎల్‌క్‌, రంజీలకు పరిమితమయ్యారు.

211
ప్రస్తుతం ఆయన ఈటీవీలో సాయికుమార్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే `వాహ్‌..` షోలో పాల్గొన్నారు. ఆయనతోపాటు క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, గుత్తా జ్వాల, నటి మధుశాలిని పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇది జనవరి ఐదున ప్రసారం కానుంది.

311
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఓజాతోపాటు పాల్గొన్న వారంతా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆద్యంతం సరదాగా, కామెడీగా ఈ షో సాగినట్టు ప్రోమోని చూస్తూంటే అర్థమవుతుంది.

411
ఇందులో ప్రగ్యాన్‌ ఓజా క్రికెట్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. సాయికుమార్ కుమారుడు, హీరో ఆది.. తనతో కలిసి మొదట్లో క్రికెట్‌ ఆడారట. ఆ సమయంలో తనని బాగా ఒత్తిడి తెచ్చేవారని, బాగా ఆడిపించేలా చేయాలని చెప్పినట్టు వెల్లడించారు. వెస్టిండీస్‌ తనకిష్టమైన టీమ్‌ అని, ఆ టీమ్‌తో పది వికెట్లు తీశావని సాయి అనగా నవ్వులు పూసాయి.

511
ఇక నీకు బెస్ట్ వికెట్‌ ఏంటని సాయి కుమార్ అడగ్గా, క్రిస్‌ గేల్‌ అని ఓజా చెప్పారు. `ఎందుకంటే వాడు ఛాలెంజ్‌ చేశాడు. బయట కొడతానని చెప్పాడు. స్టేడియం బయట.. మనం ఇండియన్స్ కదా సర్‌.. అందుకే వికెట్‌ తీశా` అని చెప్పాడు.

611
జ్వాలా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే. గుండె జారి గల్లంతయ్యిందే అంటూ ఆటపట్టించాడు సాయికుమార్‌. అందుకు ఆమె తలపట్టుకుంది. `గుండెజారి గల్లంతయ్యిందే` చిత్రంలో గుత్తా జ్వాల ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం ఆమె తమిళ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమాయణం సాగించారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుండటం విశేషం.

711
మరోవైపు తప్పు ఆన్సర్‌ ఇస్తే రీటేకా అని జ్వాలా అనడం, ఒకరికి తెలియకపోతే, మరొకరు షేర్‌ చేసుకోవచ్చా అని హారిక చెప్పడం నవ్వులు పూయించింది.

811
`బాహుబలి`ని ఎన్నిసార్లు చూసి ఉంటావని సాయి కుమార్‌ అడగ్గా, మెనీ టైమ్స్ అని తెలిపింది గుత్వా జ్వాల. అందుకు ఓజా స్పందిస్తూ సర్‌ అడిగేది `బాహుబలి`ని ప్రభాస్‌ని కాదని అనడం కామెడీని పంచింది.

911
`బాహుబలి`లో అనుష్కతో ప్రభాస్‌ చెప్పే `తప్పు చేస్తే నరకాల్సింది వేలు కాదు దేవసేనా.. తల` అనే డైలాగ్‌ చెప్పిస్తాడు సాయికుమార్‌. అందుకు నేను చెప్పింది సీరియస్‌గానే అని జ్వాల అనడం నవ్వించింది. మైండ్‌ గేమ్‌ అని మధుశాలిని వేసిన పంచ్‌ ఆకట్టుకుంది.

1011
ఇలా ఆద్యంతం నవ్వులు, జోకులతో సాగిందీ షో. కానీ ఇందులో ఓజా చెప్పిన `లకలకలక.. ` డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

1111
హోస్ట్ గా మరోసారి మెప్పించారు సాయికుమార్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories