OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ

Published : Jul 06, 2026, 10:44 AM IST

రాంచరణ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది ఓటీటీలో రిలీజ్ కానుంది. పెద్ది మూవీతో పాటు రకుల్ రొమాంటిక్ మూవీ పతి పత్నీ ఔర్ వో దో లాంటి మరిన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి.

PREV
16
Ram Charan

సినీ ప్రేక్షకులకు మరోసారి ఓటీటీలో వినోదాల పండుగ సిద్ధమైంది. జూలై 8 నుంచి 12 మధ్య నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5 వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది.

26
Netflix

పెద్ది

రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుండగా, హిందీ వెర్షన్ ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 9

పతి పత్నీ ఔర్ వో దో

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 10

ఇక్కా

అక్షయ్ ఖన్నా, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో ఉత్కంఠభరితమైన విచారణ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా సన్నీ డియోల్, టిలోటమా షోమ్ మధ్య సన్నివేశాలపై ఆసక్తి నెలకొంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 10

Little House On The Prairie

1870-1890 కాలంలో అమెరికాలోని ఒక రైతు కుటుంబ జీవితం చుట్టూ సాగే ఈ హిస్టారికల్ డ్రామా సిరీస్ ప్రముఖ నవలల ఆధారంగా రూపొందింది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 9

Shipwrecked: Nightmare At Sea

2012లో జరిగిన కోస్టా కాన్‌కోర్డియా విలాసవంతమైన క్రూయిజ్ ప్రమాదాన్ని ఈ డాక్యుమెంటరీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. అరుదైన వీడియోలు, బాధితుల అనుభవాలతో ఈ కథనం సాగుతుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 10

Until The T-Shirt Dries

ఒక ప్రమాదం తర్వాత ఇద్దరు దంపతుల జీవితాల్లో చోటుచేసుకునే మార్పుల నేపథ్యంలో సాగే జపనీస్ డ్రామా సిరీస్ ఇది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 10

Susana And Elvira: No Plan B

రెండేళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్న ఇద్దరు స్నేహితులు ఓ ప్రముఖ వివాహ వేడుకను నిర్వహించే క్రమంలో ఎదుర్కొనే పరిణామాలే ఈ స్పానిష్ కామెడీ డ్రామా కథ.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 12

The Apartment Job

డబ్బు కోసం ఓ మాజీ గ్యాంగ్ లీడర్, ఓ యువ లాయర్ కలిసి భారీ దోపిడీకి ప్లాన్ చేస్తారు. అయితే ఆ ప్రయత్నంలో ఊహించని అవినీతి రహస్యాలు బయటపడతాయి.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూలై 11

36
JioHotstar

Land Of Football

భారతదేశంలో ఫుట్‌బాల్ పట్ల ఉన్న అభిమానాన్ని, ముఖ్యంగా కేరళలో ఆ ఆటకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని చూపించే మలయాళ డాక్యుమెంటరీ సిరీస్.

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: జూలై 10

46
ZEE5

పరిమళ అండ్ కో

జయరామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్‌లో హాస్యం, సస్పెన్స్, కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన కథనం ఉంటుంది.

ఎక్కడ చూడాలి: ZEE5 

రిలీజ్ డేట్: జూలై 10

56
SonyLIV

బాల్టీ

షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ యాక్షన్ డ్రామా కేరళ-తమిళనాడు సరిహద్దు నేపథ్యంలో స్పోర్ట్స్, క్రైమ్, భావోద్వేగ అంశాలను మిళితం చేస్తూ సాగుతుంది.

ఎక్కడ చూడాలి: SonyLIV 

రిలీజ్ డేట్: జూలై 10

66
Prime Video

Trying season 5

పిల్లలను దత్తత తీసుకునే ప్రయాణంలో ముందుకు సాగుతున్న నిక్కీ, జేసన్ జీవితాల్లో కొత్త పాత్ర ప్రవేశించడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: జూలై 8

The Westies

1980ల న్యూయార్క్ నేపథ్యంలో సాగిన ఐరిష్ గ్యాంగ్ కథను ఆధారంగా చేసుకుని రూపొందిన క్రైమ్ డ్రామా సిరీస్ ఇది.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: జూలై 12

Read more Photos on
click me!

Recommended Stories