
సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్‌లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి కొరియన్ రొమాంటిక్ సిరీస్‌ల వరకు ఎన్నో కొత్త టైటిల్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’, ‘రక్తాంచల్ 3’, ‘వుదరింగ్ హైట్స్’, ‘రెడీ ఆర్ నాట్ 2’ వంటి టైటిల్స్ ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
సెకండ్ లవ్ (Second Love)
రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’ తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఒకే ఇంట్లో కలిసి రెండోసారి ప్రేమను వెతుక్కునే ప్రయత్నం చేయడం ఈ షో ప్రధానాంశం. ‘బిగ్‌బాస్ 18’ ఫేమ్ శ్రుతికా అర్జున్ ఇందులో మార్గదర్శకురాలిగా కనిపించనుంది.
ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్
రిలీజ్ డేట్ : జూలై 13
మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో స్వర్ణ అనే మాజీ హంతకురాలు పెళ్లి తర్వాత తన పాత జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమె గతం మళ్లీ ఆమె జీవితంలోకి రావడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్
రిలీజ్ డేట్ : జూలై 17
వుదరింగ్ హైట్స్ (Wuthering Heights)
ఎమిలీ బ్రాంటే రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో జేకబ్ ఎలోర్డి, మార్గోట్ రాబీ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రానుంది.
ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్
రిలీజ్ డేట్ : జూలై 13
రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ (Ready Or Not 2: Here I Come)
2019లో విడుదలైన హిట్ యాక్షన్ హారర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. గ్రేస్ పాత్ర మరోసారి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ కనిపించనుంది.
ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్
రిలీజ్ డేట్ : జూలై 16
ది హాక్ (The Hawk)
విల్ ఫెరెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ సిరీస్‌లో ఒకప్పటి నంబర్ వన్ గోల్ఫర్ లానీ హాకిన్స్ తన కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రధానంగా ఉంటాయి.
ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : జూలై 16
స్పూకీ ఇన్ లవ్ (Spooky In Love)
పార్క్ యూన్-బిన్, యాంగ్ సె-జాంగ్ నటించిన ఈ కొరియన్ డ్రామాలో దెయ్యాలను చూడగలిగే ఓ హోటల్ వారసురాలు, దెయ్యాలకు భయపడే ఓ ప్రాసిక్యూటర్ మధ్య ఏర్పడే అనుబంధం కథగా ఉంటుంది.
ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : జూలై 18
23,000 లైవ్స్ (23,000 Lives)
మధ్యధరా సముద్రంలో చిక్కుకున్న శరణార్థులను రక్షించిన యువకుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ జర్మన్ చిత్రం రూపొందింది.
ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : జూలై 17
హార్ట్‌స్టాపర్ ఫరెవర్ (Heartstopper Forever)
పాఠశాల స్నేహం ప్రేమగా మారిన ఇద్దరు యువకుల కథతో ప్రేక్షకాదరణ పొందిన ‘హార్ట్‌స్టాపర్’ సిరీస్‌కు ఈ ఫీచర్ ఫిల్మ్ ముగింపు పలకనుంది.
ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : జూలై 17
రైడ్ ఆర్ డై (Ride Or Die)
ఒక హత్యా ప్రయత్నం విఫలమైన తర్వాత పరారీలోకి వెళ్లిన ఇద్దరు మహిళల కథతో ఈ యాక్షన్ కామెడీ సిరీస్ తెరకెక్కింది. స్నేహం, యాక్షన్, హాస్య అంశాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : జూలై 15
మర్డర్ 101 (Murder 101)
అమెరికాలో సంచలనం సృష్టించిన ‘రెడ్‌హెడ్ మర్డర్స్’ కేసును ఓ హైస్కూల్ టీచర్, విద్యార్థులు కలిసి దర్యాప్తు చేసే కథతో ఈ ట్రూ క్రైమ్ డాక్యుసిరీస్ రూపొందింది.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : జూలై 13
రక్తాంచల్ 3 (Raktanchal 3)
నికితిన్ ధీర్, కరణ్ పటేల్, మహీ గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ డ్రామా మూడో సీజన్ ప్రతీకారం, అధికారం, ద్రోహం నేపథ్యంలో మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : జూలై 16
ది డెవిల్ (The Devil)
దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ యాక్షన్ డ్రామా ‘ది డెవిల్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆరు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఎక్కడ చూడాలి : జీ5
రిలీజ్ డేట్ : జూలై 13
లక్కీ (Lucky)
‘ది క్వీన్స్ గ్యాంబిట్’ ఫేమ్ అన్యా టేలర్-జాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌లో దొంగతనాలు, ప్రేమ, యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఎక్కడ చూడాలి : ఆపిల్ టీవీ ప్లస్
రిలీజ్ డేట్ : జూలై 15