Lenin 3 Days Collections: బాక్సాఫీసు దుమ్ము దులిపేస్తున్న అఖిల్‌.. మూడో రోజు లెనిన్‌కి షాకింగ్‌ కలెక్షన్లు

Published : Jul 13, 2026, 07:54 AM IST

అఖిల్‌ అక్కినేని నటించిన సినిమాల్లో పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న చిత్రం `లెనిన్‌`. ఇది కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. ఆదివారం దీనికి ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చాయి.

PREV
15
బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న లెనిన్‌

అక్కినేని నట వారసుల్లో నాగచైతన్య హీరోగా నిరూపించుకున్నాడు. మంచి విజయాలు అందుకుంటూ రాణిస్తున్నాడు. ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్ చాలానే ఉన్నాయి. అయితే నాగార్జున రెండో కొడుకు అఖిల్‌కి మాత్రం హిట్‌ రాలేదు. కెరీర్‌ పరంగా బ్రేక్‌ ఇచ్చే చిత్రం  రాలేదు. ఆ లోటుని ఇప్పుడు `లెనిన్‌` తీర్చబోతుంది. ఈ మూవీకి చాలా వరకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్ములేపుతోంది. ఊహించని విధంగా వసూళ్లని రాబట్టడం విశేషం.

25
లెనిన్‌ మూవీ మూడు రోజుల కలెక్షన్లు

లెనిన్‌ మూవీ తొలి వీకెండ్‌ని పూర్తి చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మూడు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, ఆశ్చర్యకరమైన వసూళ్లని సాధించింది. మూడు రోజుల్లోనే సగం కలెక్షన్లని రాబట్టడం విశేషం. తొలి వీకెండ్‌లో ఈ మూవీ రూ.37.07కోట్లు(సాక్నిల్క్ సైట్‌ ప్రకారం) సాధించింది.   మూడో రోజు(శనివారం) రూ.9.65కోట్లు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో ఇది రెండు కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా మూడో రోజు దీనికి రూ.11.65కోట్లు వచ్చాయి. శనివారంతో పోల్చితే ఆదివారం కలెక్షన్లు పెరగడం విశేషం.

35
మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌లో సగం కలెక్షన్లు

ఇక `లెనిన్‌` మూవీ ఇండియాలో మూడు రోజుల్లో రూ.29.27కోట్ల గ్రాస్‌, రూ.25.45కోట్ల నెట్‌ కలెక్షన్లని రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.7.80కోట్లు రాబట్టడం విశేషం. సోమవారం బుకింగ్స్ ఈ చిత్రానికి బాగానే ఉన్నాయి. అయితే ఈ రోజు ఎంత రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీక్‌ డేస్‌లో ఈ మూవీ సత్తా చాటేదాన్ని బట్టి `లెనిన్‌` భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.37కోట్లు సాధించినట్టు చిత్ర బృందం వెల్లడించింది. టీమ్‌ చెప్పే లెక్కల ప్రకారం ఇది మూడు రోజుల్లో యాభై కోట్లకు చేరే అవకాశం ఉంది. అంటే ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ లో సగం రికవరీ చేస్తుందని చెప్పొచ్చు.

45
లెనిన్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`లెనిన్‌` సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.40కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌ ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్ జీ వాళ్లు తీసుకున్నారు. దీని రూపంలో దాదాపు 30శాతం రికవరీ అయ్యిందట. ఇక థియేట్రికల్‌గా తెలుగు రాష్ట్రాల్లో .25కోట్లుగా లెక్కకట్టారు. కర్నాటకలో రూ.8కోట్లు, ఇతర రాష్ట్రాలు కలిపి మరో రెండు కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌ మొత్తంగా మరో పది కోట్లకు అమ్మినట్టు సమాచారం. మొత్తంగా ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.45కోట్ల షేర్‌ రావాలి. అంటే రూ.90కోట్లకుపైగా గ్రాస్‌ వసూలు చేయాలి. ఇప్పటి వరకు 40శాతం వసూళ్లని రాబట్టింది. లాంగ్‌ రన్‌లో ఎంత చేస్తుందనేది చూడాలి.

55
లెనిన్‌ మూవీ కథేంటంటే?

అఖిల్‌ అక్కినేని హీరోగా `లెనిన్‌` మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. చిత్తూరి జిల్లా శ్రీరామాపురంలో ఈ కథ జరుగుతుంది. అక్కడ భరతం మిట్టా అనే జాతర చాలా ఫేమస్‌. అందులో ధర్మరాజు కిరీటం కోసం పోటీ ఉంటుంది. ఊరు పెద్ద అయిన ఈశ్వరీరావు దాన్ని నిర్ణయిస్తుంది. ఆమె నమ్మిన బంటు లెనిన్‌(అఖిల్‌). అతను భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని ప్రేమిస్తాడు. కానీ ఆమెపై లెనిన్‌ ఫ్రెండ్‌(ప్రమోద్‌) మనసు పడతాడు. ఆమెని దక్కించుకోవడం ఆడిన యాక్షన్‌ డ్రామానే ఈ మూవీ. దీన్ని లెనిన్‌ ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మూవీ పూర్తి కమర్షియల్‌ మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్ గా నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories