Asterix & Obelix: The Big Fight
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఏప్రిల్ 28
గాల్ గ్రామాన్ని రోమన్ సైన్యం నుంచి కాపాడే క్రమంలో, మేజిక్ పోషన్ రహస్యం ప్రమాదంలో పడుతుంది. ఆస్టెరిక్స్, ఒబెలిక్స్ సరదాగా కానీ యాక్షన్‌తో నిండిన అడ్వెంచర్‌లో పడతారు.
Chef’s Table: Legends
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఏప్రిల్ 28
10వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన ఈ సీజన్‌లో ప్రపంచ ప్రఖ్యాత చెఫ్‌లు జేమీ ఒలివర్, జోసే ఆండ్రేస్, అలిస్ వాటర్స్, థామస్ కెల్లర్ జీవితం, వంట కళను చూపిస్తుంది.
Exterritorial
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఏప్రిల్ 30
తన కొడుకు కనిపించకుండా పోవడంతో, ఒక మాజీ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ అమెరికా కాన్సులేట్‌లోకి చొరబడి భారీ కుట్రను వెలికితీయడానికి ప్రయత్నిస్తుంది.
El Eternauta
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఏప్రిల్ 30
బ్యూనస్ ఎయిర్స్‌లో విషపూరిత మంచు వల్ల జనాలు చనిపోతుంటారు. ఇది అసలు ఎలియన్ దాడి అని తెలుసుకున్న కొందరు బ్రతికినవారు జీవన పోరాటం మొదలుపెడతారు.
రాకాస
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: మే 1
కొణిదెల నిహారిక నిర్మించిన రాకాస చిత్రం మే 1 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.