Jailer 2లో మరో పాన్‌ ఇండియా హీరో.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడానికి రజనీకాంత్‌ మాస్టర్‌ ప్లాన్‌

Published : Mar 11, 2026, 11:58 AM IST

రజనీకాంత్‌ ప్రస్తుతం `జైలర్‌ 2`తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడానికి వస్తున్నారు. అయితే ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసే ప్లాన్‌ ఒకటి చేస్తున్నారు. 

PREV
15
జైలర్‌తో కోలీవుడ్‌ లో సరికొత్త రికార్డులు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఇప్పుడు `జైలర్‌ 2` రూపొందుతోంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. గతంలో వచ్చిన `జైలర్‌` మూవీకిది సీక్వెల్‌. ఆ చిత్రం కోలీవుడ్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. తమిళంలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మరే తమిళ పాన్‌ ఇండియా మూవీ కూడా దాన్ని టచ్‌ చేయలేకపోయింది. ఇప్పుడు రజనీకాంత్‌ తన రికార్డులను తానే బ్రేక్‌ చేయబోతున్నారు.

25
జైలర్‌ 2లో మోహన్‌ లాల్‌, శివ రాజ్‌ కుమార్‌

ప్రస్తుతం `జైలర్‌ 2` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రజనీకాంత్‌. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భారీ కాస్టింగ్‌ నటిస్తోంది. రజనీకాంత్‌తోపాటు మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్నారు. మొదటి భాగంలోనూ వీరిద్దరున్నారు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. తెలుగు నుంచి ఓ హీరో కనిపిస్తారనే ప్రచారం జరిగింది. బాలకృష్ణ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.

35
`జైలర్‌ 2`లో మరో పాన్‌ ఇండియా హీరో

ఈ క్రమంలో ఇందులో మరో సూపర్‌ స్టార్‌ కనిపిస్తారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనే షారూఖ్‌ ఖాన్‌. గతంలోనూ ఈ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలిసింది. రణ్‌వీర్‌ సింగ్‌ కనిపిస్తారని అన్నారు. కానీ దీనిపై కూడా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం షారూఖ్‌ ఖాన్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన గెస్ట్ రోల్‌ చేస్తున్నారట. పోలీస్‌ పాత్రలో షారూఖ్‌ ఖాన్‌ కనిపిస్తారని సమాచారం.

45
`జైలర్‌ 2`లో షారూఖ్‌ ఖాన్‌ స్పెషల్‌ రోల్‌

మొదటి భాగంలో రజనీకాంత్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో జైలర్‌గా కనిపిస్తారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్‌ ఎక్కువగా చూపిస్తారని, ఆ ఎపిసోడ్‌లో షారూఖ్‌ ఖాన్‌ కనిపిస్తారని సమాచారం. ఆ సమయంలో రజనీకాంత్‌కి, షారూఖ్‌ పాత్రకి మంచి స్నేహం ఉంటుందని, క్లిష్ట సమయంలో మళ్లీ ఆయన రజనీకాంత్‌ కి హెల్ప్ చేయడానికి వస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతా అనేది చూడాలి.

55
ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసేందుకు రజనీకాంత్‌ ప్లాన్‌

ఇదే నిజమైతే ఇండియన్‌ సినిమా షేక్‌ కాబోతుందని చెప్పొచ్చు. రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, శివ రాజ్‌ కుమార్‌ ఉండటంతో సౌత్‌ మార్కెట్‌ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు షారూఖ్‌ ఖాన్‌ వస్తే నార్త్ మార్కెట్‌ సెట్‌ అవుతుంది. మొత్తంగా ఇండియన్‌ బాక్సాఫీసు షేక్‌ అవుతుందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఇటు రజనీ, అటు నెల్సన్‌ అదిరిపోయేలా ప్లాన్‌ చేస్తున్నారని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories