`గుంటూరు కారం`, `నా సామిరంగ`లో ఒక కామన్‌ పాయింట్‌.. నైజాంలో దెబ్బకొట్టడానికి కారణమదేనా?

Published : Jan 16, 2024, 11:09 AM IST

సంక్రాంతి పండక్కి వచ్చిన మహేష్‌బాబు `గుంటూరు కారం`, నాగార్జున `నా సామిరంగ` చిత్రాలు సందడి చేస్తున్నాయి. కానీ నైజాంలో ఈ సినిమాలు అంతగా ప్రభావాన్ని చూపడం లేదు. మేకర్స్ మిస్టేక్‌ ఇదే..  

PREV
17
`గుంటూరు కారం`,  `నా సామిరంగ`లో ఒక కామన్‌ పాయింట్‌.. నైజాంలో దెబ్బకొట్టడానికి కారణమదేనా?

సంక్రాతి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది సినిమాల పండగే. నాలుగైదు సినిమాలు రిలీజ్‌ అవుతూ సందడి చేస్తుంటాయి. ఆడియెన్స్ ని అలరిస్తుంటాయి. ఈ సారి కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. మహేష్‌బాబు `గుంటూరు కారం`, వెంకటేష్‌ `సైంధవ్‌`, నాగార్జున `నా సామిరంగ`తోపాటు తేజ సజ్జ, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన `హనుమాన్‌` మూవీస్‌ వచ్చాయి. ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సంక్రాంతికి మాత్రం రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉందని చెప్పొచ్చు.
 

27

అయితే ఇందులో వెంకటేష్‌ నటించిన `సైంధవ్‌` మూవీ తొలి రోజు నుంచి పోటీలో డీలా పడిపోయింది. డిజాస్టర్‌ టాక్‌తో క్లీన్‌ స్వీప్‌ అయ్యే పరిస్థితి. ఇక `హనుమాన్‌` మూవీ రచ్చ చేస్తుంది. వీటితోపాటు `గుంటూరు కారం`, `నా సామిరంగ` చిత్రాలు  బాక్సాఫీసు సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అనుకున్న రేంజ్‌లో ఆడియెన్స్ కి రీచ్‌ కావడం లేదు. ఏపీలో అంతో ఇంతో రెస్పాన్స్ బాగుంది. నైజాంతో పోల్చితే అక్కడ ఎక్కువ రియాక్షన్‌ ఉంది. మరి నైజాంలో తక్కువ స్పందనకు కారణమేంటి? వీటిలో ఉన్న లోపాల కారణంగా `హనుమాన్‌` సినిమాకి ఎలా ప్లస్‌ అవుతుందనేది చూస్తే.
 

37

`గుంటూరు కారం` సినిమాలో టైటిల్‌ కూడా ఏపీని రిప్లెక్ట్ చేసేలా ఉంది. పైగా హీరో యాస కూడా అలానే సాగుతుంది. మహేష్‌ ది గుంటూరు కావడంతో ఆ యాసని ఈజీగా పట్టేశాడు. చాలా వరకు ఇది ఏపీ కల్చర్‌ని ప్రతిబింబించేలా ఉంది. దీంతో ఈ మూవీకి నైజాంలో ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. ఏపీతో పోల్చితే ఇక్కడ రెస్పాన్స్ తక్కువగా ఉంది. సినిమా టైటిల్‌ కూడా ఈ గ్యాప్‌కి కారణమయ్యిందని అంటున్నారు. 
 

47

మరోవైపు నాగార్జున నటించిన `నా సామిరంగ` పూర్తిగా సంక్రాంతి పండగ సినిమా. అందులో కూడా ఏపీ కల్చర్‌ని ప్రతిబింబించే ఎలిమెంట్లే ఉన్నాయి. పూర్తిగా గోదావరి ప్రాంతాల కల్చర్‌ని రిప్లెక్ట్ చేస్తుంది. దీంతో అది నైజాం ఏరియాలో ఈ మూవీకి రెస్పాన్స్ కాస్త తక్కువగా ఉంటుంది. ఏపీలో ఆదరణ బాగుంది. ఇలా కల్చర్‌ డిఫరెంట్స్ కారణంగా ఆదరణ విషయంలో కొంత గ్యాప్‌ కనిపిస్తుంది.  
 

57

గతంలోనూ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన `దసరా`, `బలగం` వంటి చిత్రాలు నైజాంలో బాగా ఆదరణ పొందాయి. కానీ ఆంధ్ర, సీడెడ్‌లో మాత్రం ఆశించిన  స్థాయి రెస్పాన్స్ రాలేదు. అక్కడ కొన్న బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. ఇవే కావు చాలా సినిమాల విషయంలో ఆ డిఫరెంట్స్ కనిపిస్తుంది.
 

67

అదే డిఫరెంట్స్ ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలోనూ చోటు చేసుకుందని విశ్లేషకులు, ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో `గుంటూరు కారం`,  `నా సామిరంగ` ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తుంది.

77

ఈ రెండు సినిమాలు నైజాంలో ఆశించిన రేంజ్‌లో ఆడకపోవడంతో.. అది `హనుమాన్‌` మూవీకి హెల్ప్ అవుతుంది.  ఆ సినిమా ఇక్కడ మంచి కలెక్షన్లని రాబడుతుంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటిపోయింది. ఆల్‌రెడీ లాభాల్లోకి వెళ్లిపోయింది. మున్ముందు ఇది మరింత ఆదరణ పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. హనుమంతుడి ఎలిమెంట్లు సినిమాకి ప్లస్‌ అయ్యాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories