రష్మీ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది ... మనసులోని మాట బయటపెడుతూ జబర్దస్త్ సుధీర్ ఎమోషనల్..!

Published : Jun 18, 2022, 08:04 AM IST

బుల్లితెరపై రష్మీ గౌతమ్-సుధీర్ లది హిట్ కాంబినేషన్. చాలా కాలంగా ఈ జంట ఆడియన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. వీరిద్దరూ ప్రేమికులని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. జబర్దస్త్ సాక్షిగా మొదలైన వీరి బంధం మెల్లగా బలపడింది.   

PREV
18
రష్మీ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది ... మనసులోని మాట బయటపెడుతూ జబర్దస్త్ సుధీర్ ఎమోషనల్..!
Sudigali Sudheer - Rashmi gautam

జబర్దస్త్ యాంకర్ గా రష్మీ, కమెడియన్ గా సుధీర్ (Sudigali Sudheer)చాలా కాలం కొనసాగారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు మొదలయ్యాయి. వాళ్ళ ప్రవర్తనతో ఆ పుకార్లను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ జంటపై ఉన్న రూమర్స్ నేపథ్యంలో ప్రేమికులుగా చూపిస్తూ పలు కార్యక్రమాలు రూపొందేవి. 
 

28
Sudigali Sudheer - Rashmi gautam


రష్మీ (Rashmi Gautam), సుధీర్ ఢీ డాన్స్ రియాలిటీ షోకి వెళ్ళాక మరింత పాపులర్ అయ్యారు. అక్కడ వీరిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ బాగా పండింది. రష్మీ అంటే పడిసచ్చే అబ్బాయిగా సుధీర్, ఇష్టం ఉన్నప్పటికీ బయటపడకుండా వెంట తిప్పుకునే అమ్మాయిగా వేదికపై ప్రవర్తించే వారు. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య లవ్, ఎమోషన్స్ చోటు చేసుకునేవి. 
 

38
Sudigali Sudheer - Rashmi gautam

ఇక  రెండు మూడు సార్లు ఉత్తిత్తి పెళ్లిళ్లు కూడా జరిగాయి. ఇద్దరినీ పట్టుబట్టలో వధూవరులుగా అలంకరించి బుల్లితెర నటులు, కమెడియన్స్, యాంకర్స్ వివాహం చేశారు. వీరి పెళ్లి జరిగిన ఎపిసోడ్స్ భారీ టీఆర్పీ తెచ్చుకున్నాయి. అయితే ఇదంతా ఫేమ్, పాపులారిటీ, టీఆర్పీ కోసమే, వాళ్ళ మధ్య ఏం లేదనే ఓ వాదన ఉంది.

48
Sudigali Sudheer - Rashmi gautam


నిజంగా సుధీర్-రష్మీ ప్రేమికులా, స్నేహితులా లేక కేవలం యాంకర్సా అనే కన్ఫ్యూషన్ కొనసాగుతుంది. పలు సంధర్భాల్లో దీనిపై రష్మీ, సుధీర్ స్పందించారు. నిజం ఏదైనా మేము కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకుంటారు. వీరిద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అదే చెబుతారు. అసలు ప్రేమ, అభిమానం లేకుండా వాళ్ళు ఆ రేంజ్ లో బుల్లితెరపై రొమాన్స్ కురిపిస్తున్నారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. 
 

58


ఇక కొన్నాళ్లుగా వీరిద్దరి కాంబినేషన్ బుల్లితెర ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. కారణం జబర్దస్త్ లో సుధీర్ చేయడం లేదు. అలాగే ఢీ షో నుండి రష్మీ, సుధీర్ బయటికి వచ్చేశారు. రష్మీ, సుధీర్ కలిసి కనిపించే ఒక్క షో కూడా ప్రస్తుతం లేదు. ఈటీవికి పూర్తిగా దూరమైన సుధీర్ సార్ మా, జీ తెలుగు వంటి ఛానల్స్ లో సందడి చేస్తున్నారు. 

68


తాజాగా జీ తెలుగులో ఫాదర్స్ డే సందర్భంగా దిల్ సే షోను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ ఎపిసోడ్ కి గోపీచంద్, రష్మీ ఖన్నా, డైరెక్టర్ మారుతి, రాజీవ్ కనకాల, సింగర్ శైలజ, ఆమె భర్త శుభలేఖ సుధాకర్ చాలా మంది ప్రత్యేక అతిథులు వచ్చారు. చాలా సందడిగా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. 

78

ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సుడిగాలి సుధీర్ కి ఫ్యాన్స్ కూడా వేదికపైకి రావడం జరిగింది. వాళ్లలో ఏడేళ్ల ఓ కుర్రాడు సుధీర్ ని బాబాయ్ అంటూ సంబోధించాడు. ఆయనకు చిన్న గిఫ్ట్ ఇచ్చిన ఆ పిల్లాడు.. రష్మీ పిన్ని ఏది బాబాయ్ అని అమాయకంగా అడిగారు. ఆ ప్రశ్నకు సుధీర్ ఎమోషనల్ ఆన్సర్ ఇచ్చాడు. రష్మీ గుండెల్లో ఉంటుంది. బయటికి కనిపించదు.. అన్నారు. రష్మీ గురించి సుధీర్ చెప్పిన ఈ సమాధానం వైరల్ గా మారింది.

88


అలాగే సుధీర్, రష్మీ ప్రేమికులేనా అనే అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. మరోవైపు ఈ బుల్లితెర స్టార్స్ థర్టీ ప్లస్ లో కి ఎంటర్ అయ్యారు. అయినపప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories