సీక్రెట్‌గా హీరోని పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్‌.. వెడ్డింగ్‌ ఫోటోలు వైరల్‌

Published : Jun 17, 2022, 11:31 PM IST

ఇటీవలే నయనతార, విఘ్నేష్‌ మ్యారేజ్‌ చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో తెలుగు హీరోయిన్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడం విశేషం. 

PREV
18
సీక్రెట్‌గా హీరోని పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్‌.. వెడ్డింగ్‌ ఫోటోలు వైరల్‌

మరో హీరోయిన్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. చడీ చప్పుడు కాకుండా మ్యారేజ్‌ చేసుకుని అభిమానులకు షాకిచ్చింది హీరోయిన్‌ మధు శాలిని. హీరోయిన్‌, సెకండ్‌ హీరోయిన్‌గా ఇలా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించిన మధు శాలిని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. 

28

మధు శాలిని.. తమిళ నటుడు గోకుల్‌ ఆనంద్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరు వివాహం గురువారం(జూన్‌ 16) హైదరాబాద్‌లో జరగడం విశేషం. కేవలం బంధుమిత్రలు, అతికొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో ఆమె వివాహం జరిగినట్టు తెలుస్తుంది. 
 

38

తాము వివాహం చేసుకున్నట్టు వెల్లడించిన మధుశాలిని, తమ వివాహం పట్ల అభిమానులు కనిపించిన ప్రేమకి, సపోర్ట్ కి ధన్యవాదాలు తెలిపింది. మీ అందరి ప్రేమతో తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. ఈ సపోర్ట్,ప్రేమ ఇలానే ఉండాలని తెలిపింది మధు శాలిని. ప్రస్తుతం మధుశాలిని, గోకుల్‌ల పెళ్ళి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

48

ఇందులో అతికొద్ది మంది సెలబ్రిటీలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో చాలా సీక్రెట్‌గానే ఈ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె ఫోటోలు బయటకు రాకపోవడంతోనే ఆ విషయం అర్థమవుతుంది. బంధుమిత్రులు తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మధు శాలిని వివాహాన్ని కన్ఫమ్‌ చేస్తున్నాయి. దీంతో ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు. 
 

58

మధుశాలిని, గోకుల్‌ ఆనంద్‌ తమిళంలో `పంచాక్షరం` చిత్రంలో నటించారు. ఈసినిమా షూటింగ్‌ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. స్నేహంగా ప్రారంభమైన వీరి బంధం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి చేసింది. 

68

హైదరాబాద్‌లో ఓ బిజినెస్‌ మేన్‌ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన మధు శాలిని `అందరివాడు` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. `నా ప్రాణం కంటే ఎక్కువ`, `నాయకుడు`(సాంగ్‌) చిత్రంలో నటించింది. `కితకితలు` చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రంతోనే అటెన్షన్‌ క్రియేట్‌ చేసుకుంది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. 

78

మీడియం బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది. ఆ తర్వాత మధుశాలిని.. `ఒక విచిత్రం`, `అగంతకుడు`, `కింగ్‌`, `జగడం`, `వాడు వీడు`, `గోపాల గోపాల`, `కారాలు మిర్యాలు`, `పొగ`,`అనుక్షణం`, `చీకటి రాజ్యం`, `సీతావలోకనం`, `గూఢచారి` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది మధు శాలిని. 
 

88

దీంతోపాటు `9హవర్స్` అనే టెలివిజన్‌ సిరీస్‌లోనూ నటించి ఆకట్టకుంది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేస్తుంది మధుశాలిని. గోకుల్‌ అరడజను తమిళ సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories