విశ్వంభర టీజర్ రివ్యూ: రిస్క్ చేసిన చిరంజీవి, షాక్ తప్పదా?

First Published | Oct 12, 2024, 12:03 PM IST

చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర టీజర్ విడుదలైంది. చిరంజీవి భారీ రిస్క్ చేస్తున్నాడనిపిస్తుంది. ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన టీజర్ ఎలా ఉందో చూద్దాం.. 

Vishwambhara Teaser

టాలీవుడ్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ క్రమంలో యూనివర్సల్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. అయితే యూనివర్సల్ సబ్జెక్ట్స్ ని డీల్ చేయడం కత్తిమీద సామే. ఆ స్థాయి ప్రమాణాలు సినిమా కలిగి ఉండాలి. లేదంటే సినిమా ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది. 
 

Vishwambhara Teaser

ఇందుకు ఆదిపురుష్ గొప్ప ఉదాహరణ. ఆదిపురుష్ మూవీ విపరీతమైన వ్యతిరేకతకు గురైంది. రామాయణాన్ని వక్రీకరించారనే ఆరోపణలు ఒకవైపు. నాసిరకం విజువల్స్ మరోవైపు...  దర్శకుడు ఓం రౌత్ ని జనాలు ఆడేసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మరింత దారుణంగా ట్రోల్ చేశారు. రూ 600 కోట్లతో ఓం రౌత్ ఇచ్చిన విజువల్స్ అబాసుపాలయ్యాయి. బడ్జెట్ కాదు, డైరెక్టర్ కి అవగాహన ఉండాలని అర్థమైంది. 

13 ఏళ్ల క్రితమే దర్శకుడు శంకర్ రోబో మూవీలో సహజత్వంతో కూడిన విజువల్స్ అందించారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన జురాసిక్ పార్క్ విఎఫ్ఎక్స్, సీజీఐ వర్క్ ని ఇండియన్ సినిమా ఇంకా చేరుకోలేదు. డైనోసర్స్ ని ఆ మూవీలో చాలా సహజంగా ప్రజెంట్ చేశాడు స్పీల్ బర్గ్. విశ్వంభర మూవీ టీజర్ చూశాక... ఈ ఉపోధ్ఘాతం చెప్పాల్సి వచ్చింది. 
మహేష్ బాబు ఫారెన్ టూర్లపై ఎన్టీఆర్ సెటైర్లు.. తారక్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..


Vishwambhara Teaser

దర్శకుడు వశిష్ట ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ విజువల్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి. డైనోసార్స్ కాలాన్ని కూడా ఆయన టచ్ చేశాడు. టీజర్లో కొన్ని విజువల్స్ కార్టూన్ పిక్చర్స్ ని తలపించాయి. చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమాలో ఈ తరహా నాణ్యత లేని గ్రాఫిక్స్ ఊహించని పరిణామం. 

ఈ రోజుల్లో ఆడియన్స్ ఒక పట్టాన సంతృప్తి చెందడం లేదు. క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా అవసరం. టీజర్ కాన్సెప్ట్ చూస్తే విశ్వాన్ని కాపాడే వీరుడిగా, ఒక యుద్దానికి ప్రాతినిధ్యం వహించే సాహసికుడిగా చిరంజీవి పాత్ర ఉంది. ఆయన రెక్కల గుర్రం మీదొచ్చి దుష్టులను అంతం చేశాడు. చిరంజీవి లుక్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ మెప్పించింది. 
 

Vishwambhara Teaser

విజువల్స్ పరంగా నిరాశపరిచింది. ఉన్నతమైన విఎఫ్ఎక్స్ ఇవ్వలేనప్పుడు ఆ తరహా సబ్జక్ట్స్ ఎంచుకోవడం చాలా రిస్క్. సోషల్ మీడియాలో అప్పుడే విశ్వంభర పై ట్రోల్స్ మొదలయ్యాయి. విశ్వంభర విజువల్స్ ప్రధానంగా సాగే కథ అయితే చిరంజీవికి దెబ్బే. కీరవాణి బీజీఎమ్ పర్లేదు. ప్రత్యేకంగా అనిపించలేదు. అయితే కేవలం టీజర్ చూసి ఒక అభిప్రాయానికి రావడం సబబు కాదు. వశిష్ట విశ్వంభర మూవీతో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. 

Vishwambhara Teaser

విశ్వంభర మూవీలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్స్ సైతం భాగం అవుతున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడినట్లు తెలుస్తుంది. టీజర్లో రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. 
 

విశ్వంభర పాన్ ఇండియా చిత్రం కావడంతో అదే స్థాయిలో క్యాస్ట్ ని ఎంపిక చేశారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విశ్వంభర లో కీలక రోల్ చేస్తున్నారు. ఆయన మెయిన్ విలన్ అని ప్రచారం జరుగుతుంది. కునాల్ గతంలో తెలుగు చిత్రం దేవదాస్ లో నటించాడు.  బాలీవుడ్ లో రంగ్ దే బసంతి వంటి హిట్ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో కునాల్ కపూర్ నటించాడు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
 

Latest Videos

click me!