మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, పబ్లిక్ వేడుకల్లో, ప్రెస్ మీట్స్ లో వీరు చేసిన కామెంట్స్ బయటికి తీసి మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ మాటల్లోని తప్పులు హైలెట్ చేస్తూ ట్రోల్స్ సిద్ధం చేస్తారు. దీని కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా పని చేస్తాయి.