కలెక్షన్ల దుమ్మురేపుతున్న హస్తప్రయోగంపై సినిమా.. చూస్తే `ఓ మై గాడ్‌` అనాల్సిందే..

Published : Aug 30, 2023, 06:48 PM IST

డీసెంట్‌ టాక్‌తో రిలీజ్‌ అయిన  `ఓ మై గాడ్‌ 2` చిత్రం నెమ్మదిగా పుంజుకుంటుంది. సెన్సిటివ్‌ పాయింట్‌ కావడంతో ఆడియెన్స్ నుంచి స్పందన కూడా నెమ్మదిగా పెరుగుతుంది.

PREV
16
కలెక్షన్ల దుమ్మురేపుతున్న హస్తప్రయోగంపై సినిమా.. చూస్తే `ఓ మై గాడ్‌` అనాల్సిందే..

ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్నాయి. అందులో ఒకటి `గదర్ 2`, మరోటి `ఓ మై గాడ్‌2`. ఈ రెండూ గతంలో వచ్చిన సూపర్‌ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ కావడం విశేషం. అయితే `ఓమైగాడ్‌2` అందరిని ఆలోచింప చేస్తుంది. చర్చనీయాంశంగా మారుతుంది. కారణం ఇందులో ఓ సెన్సిటిల్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేయడమే. హస్తప్రయోగం అనేది సినిమాలో హాట్‌ టాపిక్‌ కాగా, ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల విషయంలోనూ హాట్‌ టాపిక్ అవుతుంది. 

26

`ఓ మైగాడ్‌2` చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించారు. అక్షయ్‌ కుమార్‌ దేవుడిగా కనిపిస్తారు. యామీ గౌతమ్‌ లాయర్‌గా నటించారు. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటి వరకు 19 రోజులుగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. డీసెంట్‌ టాక్‌తో రిలీజ్‌ అయిన ఈ చిత్రం నెమ్మదిగా పుంజుకుంటుంది. సెన్సిటివ్‌ పాయింట్‌ కావడంతో ఆడియెన్స్ నుంచి స్పందన కూడా నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రెండు వందల కోట్ల కలెక్షన్లని సాధించింది. 
 

36

పక్కన `గదర్‌ 2` వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ ఉన్నప్పటికీ, అది కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నటికీ `ఓ మైగాడ్‌ 2`కి ఇంతటి ఆదరణ దక్కడం విశేషం. దానికి అక్షయ్‌ కుమార్‌, పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌లు మాత్రమే కాదు, ఇందులో చర్చించిన పాయింట్‌ కూడా కీలకంగా నిలుస్తుంది. సినిమా ద్వారా సెక్స్ ఎడ్యూకేషన్‌ గురించి చర్చించారు. దానిపై ఓ సెటైరికల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెక్స్ ఎడ్యూకేషన్‌పై అవగాహన కల్పించేలా తెరకెక్కించారు. సహజంగా `సెక్స్` అనే పదం మన సమాజంలో చాలా షేమ్‌ ఫీలింగ్‌ని తెచ్చే పదంగా, బూతుగా, ఛీ అనేలా చూస్తుంటారు. సెక్స్ ఎడ్యూకేషన్‌ అంటే అదేదో ప్రైవేట్‌ వ్యవహారంగా పరిగణిస్తారు. సమాజంలో బహిరంగంగా దాన్ని చర్చించేందుకు ఆసక్తి చూపించరు. 
 

46

ఈ నేపథ్యంలో సెక్స్ ఎడ్యూకేషన్‌ ప్రాముఖ్యతని తెలియజేసేలా, ఇంట్లో పిల్లలతో ఈ విషయాన్ని పేరెంట్స్ స్వేచ్ఛగా చర్చించాలని, ఆ బిడియాల నుంచి బయటపడాలని, అప్పుడు తప్పు చేయకుండా, సమాజంలో తప్పులు జరగకుండా ఉంటాయనేది ఈ చిత్రంలో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా ప్రధానంగా హస్త ప్రయోగం చుట్టూ తిరుగుతుంది. ఇందులో పంకజ్‌ త్రిపాఠి పూజా సామాన్ల షాప్‌ని నిర్వహిస్తుంటాడు. అతని కొడుకు స్కూల్‌ స్టాండర్డ్స్ లో ఉంటాడు. టీనేజ్‌ దశలో వయాగ్రాలు తీసుకుంటాడు. డోస్‌ ఎక్కువ కావడంతో ఆసుపత్రి పాలవుతాడు. అయితే ఆ ప్రభావంతో స్కూల్‌ బాత్‌ రూమ్‌లో హస్తప్రయోగం చేసుకుంటారు. ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఇది చూసి స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆ పిల్లాడిని దండించి ఫాదర్‌ని పిలిపించి టీసీ ఇచ్చి పంపిస్తాడు. ఊరి వదిలి వెళ్లిపోవాలని చెబుతాడు. స్కూల్‌లో హేళన, ఊర్లో అవమానాలు భరించలేక ఊరి వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు పంకజ్‌ త్రిపాఠి. 
 

56

అప్పుడే శివుడు(అక్షయ్‌ కుమార్‌) వచ్చి అది తప్పుకాదు, ఇక్కడే ఉండి పోరాడు అని, కోర్ట్ లో కేసు వేయమని చెబుతాడు. ఆయనకు ధైర్యాన్నిస్తాడు. దీంతో సెక్స్ ఎడ్యూకేషన్‌పై పోరాడుతుంటాడు. దాన్ని వ్యతిరేకిస్తుంది లాయర్‌ యామీ గౌతమ్‌. ఈ వాదనలో సమాజంలో సెక్స్ పట్ల జనాల్లో ఉన్న అవగాహన, అవగాహన రహిత్యాన్ని సెటైరికల్‌గా చూపించారు. కోర్ట్ రూమ్‌ డ్రామాలో చాలా సామాజిక అంశాలను చర్చించారు. దాన్ని బూతుగా చూసే జనాలపై సెటైర్లే వేసేలా ఈ సినిమా సాగడం విశేషం. దాని గురించి అందరు ఓపెన్‌గా చర్చించుకోవాలని తెలియజేసే ప్రయత్నం చేశారు. 

66

మన నీతి సూత్రాలు, తప్పొప్పుల ధర్మ సూక్తులు, శీలోపదేశాలు ఇలా అన్నింటినీ కోర్టులో నిలబెట్టి, బట్టలూడదీసిన సినిమాగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సత్యం నగ్నంగా ఉంటుందిరా అని తెగేసి చెప్పిన సినిమా అని, ప్రశ్నించరా, ప్రశ్నిస్తే జవాబు వస్తుంది, జవాబు వస్తే ప్రశ్నలు పుడతాయి. అది సమాజ చైతన్యానికి మూలం అవుతుంది, మోరల్‌గా మనిషి ఎదుగుదలకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సినిమా చేయడం పెద్ద సాహసమే చెప్పాలి. కానీ మేకర్స్ ఆ ధైర్యం చేశారు సక్సెస్‌ అయ్యారు. ఇలాంటి సినిమా చేసిన అక్షయ్‌ కుమార్‌, పంకజ్‌ త్రిపాఠిలను అభినందించాల్సిందే. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories