అల్లు అర్జున్‌తో ఓఎల్‌ఎక్స్ యాడ్‌ ఆ కుర్రాడి లైఫ్‌ టర్న్.. కట్‌ చేస్తే హీరోగా సినిమా!

First Published | Aug 19, 2024, 8:14 AM IST

అల్లు అర్జున్‌ తో చేసిన యాడ్‌ ఓ కుర్రాడి లైఫ్‌ని మార్చేసింది. ఏకంగా మెయిన్‌ లీడ్‌గా సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆ కథేంటో చూస్తే.. 
 

సినిమా అంటేనే ఓ మ్యాజిక్‌, అదో మాయా ప్రపంచం. స్టార్లు రాణిస్తున్న వారిని కిందకు పడేయగలదు, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారిని స్టార్లని చేయగలదు. ఒక్క సినిమా, ఒక్క హిట్‌ ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంది. అలాగే ఓ యాడ్‌ ఓ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు మెయిన్‌ లీడ్‌గా సినిమా చేసే స్థాయికి తీసుకొచ్చింది. అయితే అది అల్లు అర్జున్‌తో కలిసి చేసిన యాడ్‌ కావడం విశేషం. మరి ఆ కుర్రాడు ఎవరు? ఆ కథేంటి? ఆయన చేస్తున్న సినిమాలేంటనేది చూస్తే..
 

ఆ కుర్రాడు అంకిత్‌ కొయ్య. ఆయన మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న సినిమా `మారుతీనగర్‌ సుబ్రమణ్యం`. ఇందులో రావు రమేష్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తుండగా, ఆయనకు కొడుకుగా అంకిత్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాని క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతుంది. 


ఓఎల్‌ఎక్స్ యాడ్‌తో పాపులర్‌ అయి సినిమా అవకాశాలు తెచ్చుకుంటున్న అంకిత్‌.. ఇప్పటికే వరుస విజయాలు అందుకున్నాడు. `మజిలి`తో ఇండస్ట్రీలోకి వచ్చి, `జోహార్‌`, `అశ్వత్థామ`, `తిమ్మరుసు`, `శ్యామ్‌ సింగరాయ్‌`, `సత్యభామ` వంటి చిత్రాల్లో నటించాడు. ఇటీవల `ఆయ్‌`తో హిట్‌ అందుకున్నాడు. మరి ఆ కుర్రాడి బ్యాక్‌ గ్రౌండ్‌ చూస్తే, వైజాగ్‌లో పుట్టిన అంకిత్‌, గీతం యూనివర్సిటీలో బీ టెక్‌ చేశాడు. దీపక్‌ సరోజ్‌ తనకు ఫ్రెండ్‌. అతని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. దీంతో అంకిత్‌కి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. కాలేజీలోనే కల్చరల్‌ ఈవెంట్స్ లో పార్టిసిపేట్‌ చేశాడు. అలా యాడ్స్ లో చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అల్లు అర్జున్‌తో చేసిన `ఓఎల్‌ఎక్స్` యాడ్‌ అంకిత్‌ లైఫ్‌నే మార్చేసింది. ఇందులో ఆడిషన్‌లో చూసి బన్నీనే స్వయంగా ఎంపిక చేయడ విశేషం. 
 

ఇక `మారుతీనగర్‌ సుబ్రమణ్యం` సినిమాలోనూ నటి ఇంద్రజ సజెస్ట్‌ చేసిందట. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో మదర్‌ అండ్‌ సన్‌ రోల్‌ చేశారు. ఆ పరిచయంతో ఆమె అంకిత్‌ని రిఫర్‌ చేసింది. అలా ఈ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు అంకిత్‌. ఇందులో అతని పాత్ర చాలా విచిత్రంగా ఉంటుందట. `చిన్నప్పుడు ఇంట్లో ఏడిపిస్తారు కదా... 'నువ్వు మాకు పుట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకు వచ్చాం' అని! నా క్యారెక్టర్ ఏమిటంటే... 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. ఒకానొక సీన్ వచ్చినప్పుడు రావు రమేష్ గారిని 'మా ఇంటికి ఎప్పుడు పంపిస్తావ్' అని కూడా అడుగుతాడు` అని చెప్పాడు అంకిత్‌. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 
 

అల్లు అరవింద్‌ గురించి చెబుతూ, `ఇటీవల అల్లు అరవింద్ గారిని కలిశా. ఆయన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ట్రైలర్ చూశారు. అందులో నేను అరవింద్ కొడుకును అని చెబుతా కదా! 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా` అంటూ సర్‌ప్రైజ్‌ చేశాడు అంకిత్‌.
 

Latest Videos

click me!