1.50 లక్షలకు ఓజీ టికెట్ కొన్న ఫ్యాన్.. ఆ అభిమాని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Published : Sep 22, 2025, 09:15 PM IST

OG Ticket Rate: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తొలిరోజు సినిమా చూడటానికి అభిమానులు పోటీపడుతున్నారు. ఈ తరుణంలో ప్రత్యేక వేలం నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో ధరలు చెల్లిస్తూ టికెట్ కొనుగోలు చేస్తున్నారు.

PREV
16
‘ఓజీ’ మూవీ మేనియా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెండ్ మూవీ ఓజీ. యాక్షన్-థ్రిల్లర్ ‘దే కాల్ హిమ్ OG’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ట్రెండ్స్, థియేటర్లు, ప్రీ-రిలీజ్, ట్రెలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు OG సినిమా ఓ మాస్ ఫెస్టివల్‌గా మారిపోయింది. ఇంకో 2 రోజుల్లో OG ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. టికెట్‌ల కోసం అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే, OG సినిమా పవన్ కెరీర్‌లో ఓ మెమరబుల్ మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. 

26
ఓజీ సినిమా కథ ఇదేనా

‘OG’ ను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించగా, DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. OG సినిమా విషయానికొస్తే.. ఈ యాక్షన్ మూవీలో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీర’అనే స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ అన్నీ ప్యాకేజ్‌లా డైరెక్టర్ సుజీత్ సినిమాను తెరకెక్కించారు. ఈ యాక్షన్ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దుమ్మురేపే సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రోమో, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విజువల్స్‌, డైలాగ్స్‌, ఫైట్లతో పవన్ అభిమానుల కోసం OG సినిమాను ఓ మాస్ ఫెస్టివల్‌గా రూపొందించారు.

36
ఇది కదా పవన్ రేంజ్

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్-థ్రిల్లర్ ‘ఓజీ’పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందని ఫ్యాన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, ఎమోషన్ స్పెషల్ గా నిలిచాయి. ఓజీ సినిమా విడుదల పండుగలా మారింది. ఇంకో 2 రోజుల్లో OG ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో టికెట్‌ల కోసం అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే, OG సినిమా పవన్ కెరీర్‌లో ఓ మెమరబుల్ మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అభిమానులు టిక్కెట్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రత్యేక వేలం నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో టిక్కెట్స్ కొనుగోలు చేస్తున్నారు.

46
చౌటుప్పల్‌లో రికార్డ్ వేలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లోని శ్రీనివాస థియేటర్‌లో బెనిఫిట్ షో టిక్కెట్ల వేలం జరిగింది. ఈ వేలంలో లక్కారం గ్రామానికి చెందిన అముదాల పరమేష్ మొదటి టికెట్‌ను రికార్డు ధర రూ. 1,29,999 కు గెలుచుకున్నారు. సాధారణ టికెట్ ధర రూ. 800 మాత్రమే. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ పట్ల తన భక్తిని వ్యక్తం చేస్తూ, జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ టికెట్‌ను జబర్దస్త్ హాస్యనటుడు వినోద్ బహూకరించారు.

56
రూ.1.50 లక్షలకు టికెట్ కొనుగోలు చేసిన అభిమాని!

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజ్ మామూలుగా లేదు. ఏపీలో కూడా కొన్ని థియేటర్లలో ‘ఓజీ’టికెట్లను వేలం వేస్తున్నారు. ఒక్కో టికెట్ ధర వేలు దాటిపోగా, కొన్నిచోట్ల లక్షల్లో కూడా అమ్ముడవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని, భీమిలి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నక్క శ్రీధర్ ‘ఓజీ’ సినిమా టికెట్‌ను ఏకంగా రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా నక్క శ్రీధర్ మాట్లాడుతూ – పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్టీ బలోపేతం కోసం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని, ఈ నమ్మకంతోనే టికెట్ వేలంలో పాల్గొన్నానని తెలిపారు. ఈ సంఘటన పవన్ ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టికెట్ ధర ఎంతైనా సరే, తొలిరోజు ఫస్ట్ షో సినిమా చూడాలన్న పవన్ అభిమానుల తపన ఈ టికెట్ హంగామాతో బయటపడింది. ఆన్‌లైన్ బుకింగ్స్‌తో పాటు, థియేటర్ల వద్ద క్యూలు, వేలాల్లో టికెట్లు లక్షల్లో అమ్ముడు కావడం – పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు నిదర్శనం.

66
టికెట్ ధరల పెంపునకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఓజీ సినిమా పై ఉన్న అద్భుతమైన క్రేజ్ దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచేందుకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు జరిగే ప్రత్యేక షోకు టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100 అదనంగా, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే అక్టోబర్ 4 తర్వాత ధరలు మామూలు స్థాయికి వస్తాయి. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ. 177గా, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ. 295గా అమల్లో ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories